ఇటీవల ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలను తాకుతున్న వేళ ఇప్పుడు వాటి సరసన రాగి (Copper) కూడా చేరింది. ఒకప్పుడు పెట్టుబడిదారులు పెద్దగా పట్టించుకోని ఈ లోహం.. నేడు భవిష్యత్ బంగారంగా పిలుస్తున్నారు. రాబోయే దశాబ్దాల్లో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్న నేపథ్యంలో.. రాగికి ఉన్న ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది.
తాజా గణాంకాల ప్రకారం COMEXలో Copper ధర ఔన్సుకు 6.2150 డాలర్లకి చేరుకుని కొత్త రికార్డు నమోదు చేసింది. ఇదే సమయంలో భారత్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో రాగి ధర కిలోగ్రాముకు రూ.1,411 వరకు పెరిగింది. ఈ స్థాయి పెరుగుదల రాగి మార్కెట్‌లో బలమైన బుల్లిష్ ధోరణిని సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

రాగి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటంటే.. సరఫరా-డిమాండ్ అసమతుల్యత. ఇండోనేషియా, చిలీ వంటి దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారులు. అయితే, మైనింగ్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, పర్యావరణ పరిమితులు, కార్మిక వివాదాల కారణంగా అక్కడ ఉత్పత్తి అంతరాయం చెందింది. దీని వల్ల ప్రపంచ మార్కెట్‌లో సరఫరా గణనీయంగా తగ్గింది.
మరోవైపు డిమాండ్ మాత్రం వేగంగా పెరుగుతోంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు,ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), గ్రీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంటర్లు ఇలా అన్ని రంగాల్లో రాగి కీలక పాత్ర పోషిస్తోంది. విద్యుత్ ప్రసారం, బ్యాటరీ వ్యవస్థలు, వైర్ల తయారీలో రాగి అవసరం అత్యంత ఎక్కువ. ఈ దీర్ఘకాలిక డిమాండ్ రాగి ధరలను పైకి నడిపిస్తోంది. మోతీలాల్ ఓస్వాల్ సహా అనేక ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు.. రాబోయే కాలంలో రాగి ధరల్లో ఇంకా గణనీయమైన పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. కొందరు నిపుణులు దీనిని కాపర్ సూపర్ సైకిల్ ప్రారంభంగా కూడా చూస్తున్నారు.
బంగారం, వెండి లాగా ప్రస్తుతం భారత్‌లో రాగి ETFలు అందుబాటులో లేవు. అయినప్పటికీ, పెట్టుబడిదారులకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మొదటిగా మీరు MCX ద్వారా Copper ఫ్యూచర్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, ఇది లాట్ సైజ్‌లో ట్రేడింగ్ కావడంతో కొంత రిస్క్ ఉంటుంది. మార్కెట్ అవగాహన ఉన్నవారు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది.
రెండవ మార్గం ఏంటంటే రాగి ఉత్పత్తిలో ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం. రాగి ధరలు పెరిగినప్పుడు, ఈ కంపెనీల లాభాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భారత మార్కెట్లో హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్,హిండాల్కో ఇండస్ట్రీస్, వేదాంత లిమిటెడ్ వంటి కంపెనీలు ప్రముఖంగా ఉన్నాయి.
బంగారం, వెండిలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో.. రాగి ఒక మధ్యస్థ పెట్టుబడి ఎంపికగా మారవచ్చు. డిమాండ్ బలంగా ఉండటం, సరఫరా పరిమితంగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో రాగి మంచి రాబడులు ఇవ్వగలదని నిపుణులు భావిస్తున్నారు. అయితే, కమోడిటీ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు సహజం కాబట్టి, పెట్టుబడులు చేసే ముందు మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం అవసరం.
క్లుప్తంగా చెప్పాలంటే రాగి ఇప్పుడు కేవలం ఒక పారిశ్రామిక లోహం మాత్రమే కాదు. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన లోహంగా మారుతోంది. సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే, ఇది భవిష్యత్తులో గణనీయమైన లాభాలకు దారి తీసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications