రాగిని వెంటనే కొనిపెట్టుకోండి.. 11 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన ఇన్వెస్ట్‌మెంట్.. నిపుణులు కీలక సూచన ఏంటంటే..

Copper Bull Run: గత దశాబ్ద కాలంలో రాగి కేవలం ఒక పారిశ్రామిక లోహంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ సాంకేతిక, ఆర్థిక విప్లవంలో కీలకమైన ఇంధనంగా అవతరించింది. ఎలక్ట్రిక్ వాహనాలు (EV), పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్‌ల నవీకరణ, బ్యాటరీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల విస్తరణ కారణంగా రాగికి అంతర్జాతీయంగా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో మార్కెట్ నిపుణులు ప్రస్తుత రాగి ధరల ఊపును 'స్ట్రక్చరల్ బుల్ రన్' గా అభివర్ణిస్తున్నారు. అంటే ఈ ధరల పెంపు తాత్కాలిక కారణాల వల్ల కాకుండా, ఆర్థిక, సాంకేతిక రంగాలలో వస్తున్న సుదీర్ఘ మార్పుల ఫలితంగా చోటుచేసుకుంటోంది.

కేడియా కమోడిటీ అందించిన చారిత్రక డేటా ప్రకారం.. 2016 నుండి 2026 వరకు ఉన్న 11 సంవత్సరాల కాలంలో రాగి ఏకంగా తొమ్మిది సంవత్సరాలు సానుకూల రాబడులను అందించింది. కేవలం 2018 (-20.20%), 2022 (-14.40%) లలో మాత్రమే ధరలలో క్షీణత నమోదైంది. మిగిలిన సంవత్సరాలలో చూస్తే.. 2016లో 17.35%, 2017లో 31.56%, 2019లో 6.31%, 2020లో 25.80%, 2021లో 26.83%, 2023లో 1.90%, 2024లో 3.40% చొప్పున రాబడులు వచ్చాయి.

copper price copper investment copper bull run copper bull market copper price forecast copper price prediction copper outlook copper demand copper supply copper investment returns copper stocks AI copper demand EV copper demand data center copper power grid copper copper market copper future price copper rally copper shortage copper investment India

ముఖ్యంగా 2025లో రాగి ఏకంగా 41.55% పెరిగి బలమైన శక్తిని కనబరచగా.. ప్రస్తుత 2026 సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 17% మేర లాభపడింది. 2015 ముగింపులో రాగి ధరల సూచీ 100గా భావిస్తే.. చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తే దాని విలువ ప్రస్తుతం 312కి చేరింది. అంటే ఈ 11 ఏళ్లలో రాగి విలువ మూడు రెట్లకు పైగా పెరిగి.. వార్షిక చక్రవడ్డీ రాబడి (CAGR) సుమారు 10.9 శాతంగా నమోదైంది.

ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం విద్యుత్ వాహకతలో రాగికి ఉన్న విశిష్ట స్థానమే. ప్రస్తుతం పాతబడిన పవర్ నెట్‌వర్క్‌ల ఆధునీకరణ, సౌర-పవన విద్యుత్ కనెక్షన్లు, ఏఐ డేటా సెంటర్లలోని సర్వర్లు, కూలింగ్ సిస్టమ్స్‌కు భారీగా రాగి అవసరమవుతోంది. ఉదాహరణకు ప్రముఖ టెక్ దిగ్గజం అమెజాన్ తన ఏఐ డేటా సెంటర్ల భవిష్యత్ అవసరాల కోసం గని దిగ్గజం రియో టింటోతో నేరుగా ఒప్పందం కుదుర్చుకోవడం రాగికున్న ప్రాధాన్యతను సూచిస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఏఐ, కొత్త సాంకేతికతల కారణంగా 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా రాగి డిమాండ్ మరో 50 శాతం పెరిగే అవకాశం ఉంది.

Also Read

అయితే రాగి భవిష్యత్ ధరలపై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుబిఎస్ (UBS) విశ్లేషణ ప్రకారం.. ఇండోనేషియాలోని గ్రాస్‌బర్గ్ గని అంతరాయాలు, చిలీ, పెరూలలో మందగించిన ఉత్పత్తి కారణంగా 2026లో ప్రపంచ మార్కెట్లో 407,000 టన్నుల కొరత ఏర్పడనుంది. దీంతో డిసెంబర్ 2026 నాటికి రాగి ధర టన్నుకు $13,000 మార్కును తాకుతుందని యుబిఎస్ అంచనా వేసింది.

మరోవైపు గోల్డ్‌మన్ సాక్స్ 2026 నాటికి సగటు ధర $12,650గా ఉంటుందని భావిస్తున్నప్పటికీ.. సల్ఫ్యూరిక్ యాసిడ్ కొరత వల్ల కాంగో, చిలీలలో ఉత్పత్తి దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ 490,000 టన్నుల మిగులు ఉండవచ్చని పేర్కొంది. రాయిటర్స్ నిర్వహించిన 31 మంది విశ్లేషకుల సర్వేలో 2026లో సగటు రాగి ధర $11,975గా నమోదు కానుందని.. 2026లో 238,500 టన్నుల కొరత ఉంటుందని తేలింది.

దీర్ఘకాలంలో కొత్త రాగి గనుల ప్రారంభానికి పర్యావరణ అనుమతులు, భారీ పెట్టుబడులు, నిర్మాణం వంటి కారణాల వల్ల ఏళ్లు పడుతుంది కాబట్టి సరఫరా తక్షణమే పెరిగే అవకాశం లేదు. అయితే అతిపెద్ద వినియోగదారుడైన చైనాలో నిర్మాణం, తయారీ రంగాలు బలహీనపడటం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, అధిక వడ్డీ రేట్లు, లేదా రాగికి ప్రత్యామ్నాయంగా అల్యూమినియం వాడకం పెరగడం వంటివి మార్కెట్‌కు ప్రమాదకరమైన అంశాలు. కాబట్టి దీర్ఘకాలిక డిమాండ్ దృఢంగా ఉన్నప్పటికీ, గతంలో చోటుచేసుకున్న భారీ పతనాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తో ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+