తమిళ సినీ పరిశ్రమలో ఒకే వారం రోజుల్లోనే కూలీ సినిమా చరిత్రను కొత్తగా తిరగరాసింది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025లో ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఏడో రోజు ముగిసే సరికి రూ.222 కోట్ల మార్కును దాటేసింది.
ఆగస్టు 14న విడుదలైన రజినీకాంత్ కూలీ మొదటి రోజే రూ.65 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత రోజుల్లో వసూళ్లలో అదే బలమైన ఊపు కొనసాగింది. అయితే, వారం గడుస్తున్న Coolie కొద్దీ కలెక్షన్లలో స్వల్ప తగ్గుదల కనిపించినా.. మొత్తానికి రజనీకాంత్ స్టామినాతో సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. బుధవారం.. అంటే విడుదలైన ఏడో రోజున కూలీ దాదాపు రూ.6.5 కోట్లు కలెక్షన్ వసూలు చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా రూ.222.5 కోట్లు (నెట్) వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆరవ రోజు (మంగళవారం) భాషలవారీగా వసూళ్లు వివరాలు
తమిళం: రూ.5.65 కోట్లు
హిందీ: రూ.2 కోట్లు
తెలుగు: రూ.1.75 కోట్లు
కన్నడ: రూ.10 లక్షలు
ఈ సంఖ్యలు చూస్తే కూలీ కేవలం తమిళనాటే కాకుండా పాన్-ఇండియా స్థాయిలోనూ భారీ ఆదరణ పొందుతోందని తెలుస్తోంది. తమిళనాట మొత్తం 20.97% ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఈ సినిమా. ఉదయం షోలు 15.5 శాతం, మధ్యాహ్నం 19.3 శాతం, సాయంత్రం 23.91 శాతం, రాత్రి 25.1 శాతం ఆక్యుపెన్సీతో సినిమా బలమైన ఫుట్‌ఫాల్స్ సాధించింది. హిందీలో మాత్రం 11.69 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నప్పటికీ.. బెంగళూరు, హైదరాబాద్, లక్నో వంటి నగరాల్లో 20 శాతం వరకు థియేటర్లు నిండాయి.
భారతదేశంలో ఇప్పటివరకు రూ.255.4 కోట్లు వసూలు చేసిన కూలీ..ఓవర్సీస్‌లో రూ.162.2 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.418 కోట్ల మార్కును దాటేసింది. సినీ విమర్శకుడు, ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ ప్రకారం కూలీ కేవలం మూడు రోజుల్లోనే రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి తమిళ సినిమా చరిత్రలోనే వేగంగా ఆ రికార్డును సాధించిన చిత్రంగా నిలిచింది. "ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హోదా సాధించే దిశగా దూసుకుపోతోందని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సినిమా కలెక్షన్లు వారం చివర్లో కొంచెం మందగించినా.. రజనీకాంత్ సినిమాకు అభిమానుల క్రేజ్, పండగ వాతావరణం, పాజిటివ్ టాక్ కలిసి కూలీ ను 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా నిలబెట్టాయి. రాబోయే రోజుల్లో వసూళ్లు తిరిగి ఊపందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా రజనీకాంత్ మళ్లీ మరోసారి "థలైవా" శక్తిని బాక్సాఫీస్ వద్ద నిరూపించారు.
Disclaimer: The information provided on this page about the box-office report of the said movie is sourced from various publicly available platforms like https://www.sacnilk.com/ and https://x.com/taran_adarsh?lang=en which are the accepted and widely quoted sources for such data. GoodReturns doesn't take accountability for the same and is merely quoting numbers based these reports.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications