Coca-Cola: దేశంలోని స్టార్టప్ కంపెనీలు గత కొంత కాలంగా నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ శీతలపానీయాల దిగ్గజం కోకాకోలా ఫుడ్ డెలివరీ రంగంలోని స్టార్టప్ కంపెనీలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టింది. అసలు దీనివెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫుడ్ డెలివరీ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్ థ్రైవ్‌లో మైనారిటీ వాటాను శీతలపానీయాల దిగ్గజం కోకాకోలా కైవసం చేసుకుంది. ఇది కంపెనీ దేశంలో మెుదటి స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ కావటం గమనార్హం. ఇప్పటి వరకు మెక్‌డొనాల్డ్స్ వంటి ఫ్లాంచైజ్ లతో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీ.. ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చే వ్యూహంలో భారంగా ఆహారంతో జత చేయడాన్ని ముందుకు తెచ్చింది.

కోకాకోలా సెప్టెంబరు 2021లో భారతదేశంలో తన గ్లోబల్ మీల్స్ ప్లాట్‌ఫారమ్ 'కోక్ ఈజ్ కుకింగ్'ని కూడా ప్రారంభించింది. రెస్టారెంట్ల నుంచి ఆహారంతో పాటు తన శీతలపానీయాలను సైతం ఆర్డర్ చేసేలా కస్టమర్లను ప్రోత్సహించటమే దీని లక్ష్యం. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీ వంటి దిగ్గజాలకు పోటీగా అదే రంగంలో ఉన్న థ్రైవ్‌కు మద్దతు ఇచ్చి.. వారి ఫుడ్ డెలివరీ ఛానెల్ ద్వారా వినియోగదారులతో సన్నిహితంగా ఉండటానికి కంపెనీ ఇప్పుడు కొత్త పుష్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉంది.
తాజా పెట్టుబడి ద్వారా కస్టమర్లు థ్రైవ్ యాప్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసే సమయంలో కేవలం కోకాకోలా బ్రాండ్ కూల్ డ్రింక్స్ మాత్రమే కొనేందుకు వీలు ఉంటుంది. పైగా ప్యాకేజ్ డీల్స్, మీల్ కాంబినేషన్లను కంపెనీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పరోక్షంగా రెస్టారెంట్లకు కోకాకోలాను దగ్గర చేస్తుంది. దేశవ్యాప్తంగా 5500 స్టారెంట్ భాగస్వాములను కలిగి ఉన్న థ్రైవ్.. స్విగ్గీ, జొమాటో లాంటి ఆటగాళ్ల కంటే కమిషన్ తక్కువగా వసూలు చేస్తోంది. పైగా ఆర్డర్‌లను పొందడానికి ప్లాట్‌ఫారమ్‌లో వారి స్వంత సబ్ పోర్టల్‌లను నిర్మించడానికి వారిని అనుమతిస్తుంది.
డొమినోస్ పిజ్జా ఆపరేటర్ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ 2021లో థ్రైవ్‌లో 35% వాటాను దాదాపు రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది కంపెనీ అమ్మకాలను పెంచుకునేందుకు చేసిన వ్యూహాత్మక నిర్ణయంగా తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications