Cooking Oil Rates: గడచిన కొన్ని నెలలుగా దేశీయంగా వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యద్ధం సమయంలో పెరిగిన రేట్ల మంట ఇప్పటికీ సామాన్యులను దహించివేస్తూనే ఉంది. దీని తర్వాత రేట్లు కొంత తగ్గినప్పటికీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూనెల దిగుమతిపై సుంకాన్ని పెంచటంతో మళ్లీ వంట నూనెల రేట్లు భారీగా పెరిగాయి.
గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి నాటికి ఎడిబుల్ ఆయిల్స్ ధరలు పెరిగిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా పండుగలకు ముందు ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగాయి. గత నెలలో పామాయిల్ ధర 37 శాతం పెరిగింది. దీంతో దేశంలోని స్నాక్స్ తయారు చేసేందుకు పామాయిల్ ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ల ధరలు కూడా భారీగా పెంచుతున్నాయి. గృహాల్లో సాధారణంగా ఉపయోగించే ఆవనూనె ధర ఇదే కాలంలో 29 శాతం పెరిగింది. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి తొమ్మిది నెలల గరిష్ఠమైన 5.5 శాతానికి చేరుకుంది. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినప్పటికీ భారతీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

గత నెలలో ప్రభుత్వం ముడి సోయాబీన్, పామ్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే. దీని కారణంగా రిటైల్ మార్కెట్లలో లీటరుకు నూనె ప్యాకెట్లపై రూ.20-25 మేర పెరుగుదలను చూశాయి. దేశంలో నెలరోజులకు పైగా సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయని, ధరలను వ్యాపారులు పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ రిటైల్ మార్కెట్లలో ఆ ప్రభావం ఏమాత్రం అస్సలు కనిపించలేదు. ఈ క్రమంలో సెప్టెంబర్ 14 నుంచి ముడి పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. ఇదే సమయంలో రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచారు.
గత నెలలో అంతర్జాతీయంగా క్రూడ్ పామాయిల్ ధర 10.6 శాతం, సోయాబీన్ ఆయిల్ ధర 16.8 శాతం, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 12.3 శాతం పెరిగాయి. భారత్ తన వంటనూనె అవసరాలను తీర్చుకోవటానికి భారీగా దిగుమతులపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం 58 శాతం డిమాండ్ దిగుమతుల రూపంలోనే తీర్చబడుతోంది. వెజిటబుల్ ఆయిల్స్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఇండియా ప్రపంచంలో కొనసాగుతోంది. దిగుమతి సుంకాలు తగ్గే అవకాశం లేనందున వినియోగదారులు రాబోయే కొద్ది నెలల వరకు ధరలు పెరగవచ్చని తెలుస్తోంది. ఈ నెలలో మార్కెట్లోకి వేరుశనగ, సోయా పంట వస్తున్నందున ధరలు తగ్గే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నూనె గింజల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించటం అవసరం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications