కరోనాతో ఫుడ్ ఆర్డర్ చేయట్లేదా: అదే దారిలో స్విగ్గీ, జొమాటో, మీ కోసమే 'కాంటాక్ట్‌లెస్ డెలివరీ'

కరోనా మహమ్మారి దెబ్బకు సాఫ్టువేర్ సంస్థలు, బ్యాంకులు, వివిధ రంగాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. అయితే డెలివరీ సంస్థలకు అలాంటి వెసులుబాటు లేదు. డెలివరీలను నిలిపివేయడం లేదా డెలివరీ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవడం. దీంతో ఈ సంస్థలు రెండో ఆప్షన్ ఎంచుకున్నాయి.

కాంటాక్ట్‌లెస్ డెలివరీ

కాంటాక్ట్‌లెస్ డెలివరీ

కరోనా వైరస్ కారణంగా అత్యంత దారుణంగా దెబ్బతిన్న వాటిల్లో చైనా తర్వాత యూరోపియన్ ఉంది. దీంతో ఇక్కడ వివిధ సంస్థలు క్లోజ్ అయ్యాయి. వెసులుబాటు ఉంటే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. యూరోపియన్‌కు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ స్టార్టప్ ఇప్పుడు కాంటాక్ట్‌లెస్ డెలివరీని ప్రారంభించింది.

వివిధ సంస్థలు ఇదే దారిలో..

వివిధ సంస్థలు ఇదే దారిలో..

అమెరికాలోని పోస్ట్‌మేట్స్, ఇన్స్టాకార్ట్ వంటి సంస్థలు తాము ఆర్డర్ చేసిన ఫుడ్‌ను కొరియర్ ద్వారా నేరుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి హ్యూమన్ కాంటాక్ట్ లేకుండా డోర్ వద్ద డ్రాప్ చేస్తే, ఆ తర్వాత తీసుకోవచ్చు. గత నెలలో చైనాలోను కాంటాక్ట్‌లెస్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. యూకేకు చెందిన డెలివర్‌టూ ( Deliveroo) అనే సంస్థ 'నో కాంటాక్ట్ డ్రాప్ ఆఫ్ ఆప్షన్'ను ఈ వారం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపింది.

అందుకే కాంటాక్ట్‌లెస్ డెలివరీ

అందుకే కాంటాక్ట్‌లెస్ డెలివరీ

కాంటాక్ట్‌లెస్ డెలివరీతో ఒకటికి రెండు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు. కరోనా కారణంగా ప్రజలు బయటి ఆహారాన్ని తినడానికి సందేహిస్తున్నారు. ఆహారం పరిశుభ్రంగానే ఉన్నా సరఫరా విషయంలో సందేహాలు వారిని భయానికి గురి చేస్తున్నాయి. దీంతో కస్టమర్లకు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు భారత్ సహా ప్రపంచంలోని ఆన్‌లైన్ ఫుడ్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.

స్విగ్గీ.. అదే దారిలో జొమాటో

స్విగ్గీ.. అదే దారిలో జొమాటో

బెంగళూరు కేంద్రంగా ఉన్న స్విగ్గీ కరోనా మహమ్మారి నేపథ్యంలో తాము తీసుకుంటున్న జాగ్రత్తలు వివరించింది. కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపించింది. జొమాటో కూడా అదే దారిలో నడిచింది.

భద్రత, శుభ్రతా చర్యలు

భద్రత, శుభ్రతా చర్యలు

ఆహారాన్ని ఎంత పరిశుభ్రంగా తయారు చేసినా కస్టమర్‌కు అందించే క్రమంలోను అంతే పరిశుభ్రంగా ఉండాలి. కానీ ఇప్పుడు కరోనా కస్టమర్లను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు భద్రతా, శుభ్రత పరిణామాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇలా.. కాంటాక్ట్‌లెస్ డెలివరీ

ఇలా.. కాంటాక్ట్‌లెస్ డెలివరీ

కస్టమర్ తాను ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను నేరుగా పొందకుండా పరోక్షంగా పొందేందుకు కాంటాక్ట్‌లెస్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీని ప్రకారం వినియోగదారుడు ఈ సొకర్యం పొందాలనుకుంటే డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ ఫీచర్ ద్వారా ఎంచుకోవచ్చు. ఈ విధానం ఎంచుకుంటే డెలివరీ ఉద్యోగి తాను తెచ్చిన ఆహారాన్ని కస్టమర్ ఇంటి బయటనే ఏదైనా పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచుతాడు. దాని ఫోటో వినియోగదారుడికి చేరుకుంటుంది. కస్టమరమ దానిని తీసుకోవచ్చు.

డెలివరీ సిబ్బందికి ఊరట

డెలివరీ సిబ్బందికి ఊరట

డెలివరీ సిబ్బందికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారు తమ ఇళ్లకే పరిమితం అయ్యేలా ఆన్ లైన్ డెలివరీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. డాక్టర్‌ను సంప్రదించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఎవరికైనా కరోనా సోకితే, ఆర్థిక ఇబ్బందులతో పని చేసే అవసరం రాకుండా ఆర్థిక సహకారం చేస్తున్నట్లు తెలిపాయి. మెడికల్ ఇన్సురెన్స్ కూడా కల్పిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+