ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG) కంపెనీలకు డిమాండ్ దెబ్బ తగులుతోంది. కరోనా అనంతరం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరిగి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం FMCG కంపెనీలపై పడుతోంది. వినియోగదారులు పెరుగుతున్న ధరల ప్రభావం నుండి కాస్త ఊరట పొందడానికి పెద్ద ప్యాక్స్ నుండి చిన్న ప్యాక్స్‌కు వచ్చారు.
ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో FMCG డిమాండ్ భారీగా తగ్గింది. ఇప్పటికే పలు కంపెనీలు ధరలను పెంచాయి. మరిన్ని కంపెనీలు పెంపు బాటలో ఉన్నాయి. ధరలు పెరగడంతో కొనుగోలుదారులు గతంలో తీసుకున్న దాని కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సేల్స్ (వ్యాల్యూ పరంగాను) తగ్గాయి.

ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో అర్బన్ ప్రాంతంలో 16 శాతం తగ్గగా, గ్రామీణ ప్రాంతంలో 16.6 శాతం తగ్గాయి. గతంలో రూ.100 ప్యాక్ కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఇప్పుడు అదే ప్యాక్ రూ.150కి పెరిగినప్పటికీ, రూ.100 ప్యాక్‌ను మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. లేదా అంతకంటే తక్కువ పరిమాణంతో కొనుగోలు చేస్తున్నారు.
వివిధ కంపెనీలు గత కొంతకాలంగా ధరలు పెంచుతున్నాయి. హిందూస్తాన్ యూనీలీవర్, విప్రో, గోద్రేజ్ వంటి సంస్థలు గత నాలుగు నెలల కాలంలో ధరలను 50 శాతం వరకు కూడా పెంచాయి. బిస్కట్ నుండి సబ్బుల వరకు ధరలు పెరిగాయి. రూ.10 సబ్బుల విషయంలో మాత్రం పరిమాణాన్ని తగ్గించాయి.


Click it and Unblock the Notifications