Fine on Zomato: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా జొమాటో.. ఇంటి వద్దకే ఆహారాన్ని చేరవేస్తూ మన జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే కొన్ని విషయాల్లో కస్టమర్స్ ఆగ్రహానికి గురవుతోంది. కాగా మరికొందరు వినియోగదారులు అయితే కోర్టుకెక్కిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది.
జోధ్‌పూర్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్.. జొమాటోకు గట్టి షాక్ ఇచ్చింది. కంపెనీ మరియు రెస్టారెంట్ భాగస్వామి మెక్‌డొనాల్డ్స్‌పై లక్ష జరిమానా విధించింది. అయితే దీనిపై అప్పీల్ చేయనున్నట్లు జొమాటో తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. ఆర్డర్ చేసిన శాఖాహారం స్థానంలో సదరు సంస్థ తప్పుగా మాంసాహారాన్ని పంపిణీ చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

జరిమానా లక్షతోపాటు వ్యాజ్యానికి సంబంధించిన ఖర్చులు 5 వేలను ఇరు కంపెనీలూ భరించాల్సిందేనని జోధ్ పూర్ డిస్ట్రిక్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఫోరమ్ ఆదేశించింది. అయితే జొమాటో ఇందుకు అంగీకరించే అవకాశం లేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఈ ఆర్డర్ విషయంలో తమ తప్పేమీ లేదని జోమాటో వాదిస్తోంది. తాము కేవలం ఆహార విక్రేతకు ఫెసిలిటేటర్ మాత్రమేనని చెబుతోంది. సదరు రెస్టారెంట్ ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. సేవా లోపం, ఆర్డర్ లో వ్యత్యాసాలకు మాత్రమే తాము బాధ్యులమని జొమాటో స్పష్టం చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications