viral judgement: అంతకంతకూ పెరుగుతూ పోతున్న వైద్య ఖర్చులను భరించడం సామాన్యులకు గుదిబండగా మారింది. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్తమ మార్గం. అయితే ఈ బీమా మొత్తానికి లిమిట్ ఉంటుంది. దీనిపై వినియోగదారుల కోర్టు ఇచ్చిన తాజా తీర్పు సంచలనంగా మారింది.
వైద్య ఖర్చులపై ఇన్సూరెన్స్ కంపెనీ నిర్దేశించిన గరిష్ట పరిమితికి సంబంధించి వడోదరలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (DCDRC)
కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్, రోగి మరియు చికిత్స సమయంలో ఉపయోగించే మందులపై వైద్య ఖర్చులు ఆధారపడి ఉంటాయని గుర్తుచేసింది. ప్రతి శస్త్రచికిత్సకు ఖర్చు ఒకేలా ఉండదని, పరిమితి పేరు చెప్పి బీమా కంపెనీ క్లెయిమ్ ను తిరస్కరించరాదని పేర్కొంది.

ఫిర్యాదుదారు క్లెయిమ్ కంటే ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువగా చెల్లించడాన్ని గమనించినట్లు గుర్తించింది. ఇటువంటి మోసపూరిత సేవాలోపంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు 17 వేల 368 తిరిగి చెల్లించాలని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని వడోదర వినియోగదారుల కోర్టు ఆదేశించింది. అదనంగా ఫిర్యాదుదారుని మానసికంగా హింసించినందుకు పరిహారంగా మరో 3 వేలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
2008లో ఓ వ్యక్తి తన కుటుంబం కోసం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 'హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ టైప్ మెడిక్లెయిమ్' పాలసీని కొనుగోలు చేశారు. దీని ప్రకారం 3 లక్షల పాలసీ క్లెయిమ్ ద్వారా కవర్ చేయబడింది. అనంతరం 43 వేలకు మరో క్లెయిమ్ చేయగా కంపెనీ 21 వేలు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైంది. వ్యతిరేకించిన పాలసీదారు వినియోగదారల న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తాజా తీర్పు వెలువడింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications