tata group news: బస్సు ప్రయాణాల్లో విరిగిపోయిన సీట్లను మనం చూస్తూనే ఉంటాం. వేలకు వేలు పెట్టి టిక్కెట్లు కొన్నా మంచి సీటు దక్కుతుందనే గ్యారెంటీ లేదు. తప్పదు కదా అని సర్దుకుపోయే వారు కొందరైతే పోరాడి సాధించుకునే వారు మరికొందరు. విమాన ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ జంట కోర్టుకు వెళ్లి విజయం సాధించారు.
న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఓ దంపతులు ఎయిర్ ఇండియా విమానంలో టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. తీరా ప్రయాణ సమయంలో లోపభూయిష్టమైన బిజినెస్ క్లాస్ సీట్లు వారికి అలాట్ చేయబడ్డాయి. 8 లక్షలు చెల్లించినా కూడా తమకు అసౌకర్యం కలగడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

ఈ వ్యవహారంపై ఆ జంట చండీఘడ్ లోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఇందుకు సాక్ష్యంగా వారి టిక్కెట్స్, వైద్య రికార్డులు, విరిగిపోయిన సీట్ల ఫోటోలు మరియు ఎయిర్‌లైన్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను సమర్పించారు. ఫిర్యాదుదారుల్లో ఒకరు వైకల్యంతో బాధ పడుతున్నట్లు తమ పిటిషన్‌లో వెల్లడించారు.
ఎయిర్‌లైన్స్ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి పరిహారం కింద 50 వేలు, కోర్టు ఖర్చులకు గాను మరో 10 వేలు చెల్లించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఫిర్యాదు చేసినా పరిస్థితిని చక్కదిద్దడంలో విమానయాన సంస్థ విఫలమైనట్లు తేల్చింది. విరిగిన సీటు వల్ల ఫిర్యాదుదారుల కాళ్లు మరియు పాదాలలో వాపు కూడా వచ్చినట్లు గుర్తించింది. 14 గంటల పాటు తమ పాద రక్షణ కోసం బల్లను ఉపయోగించాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications