Indian Bank: ఇండియన్ బ్యాంక్‌కి వినియోగదారుల కమిషన్ బిగ్‌షాక్.. భారీ పరిహారానికి ఆదేశం.. వివరాలు
Banking News: ప్రముఖ దేశీయ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌కు ఓ కస్టమర్ గట్టి షాక్ ఇచ్చారు. సర్వీస్ అందించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆయన చేసిన పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించారు. దీంతో బ్యాంకుపై చట్టపరమైన చర్యలకు కోర్టు ఆదేశించింది.
ఢిల్లీలోని బురారీకి చెందిన హరీష్ చందర్ ఈ ఘటనలో బాధితులు. ఆయన శాలరీ ఖాతా నుంచి కొన్ని అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అతని జీతం అకౌంట్ నుంచి 10 లక్షల మేర బదిలీ అయినట్లు వెలుగుచూసింది. దీంతో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 35 కింద ఆయన ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ మోసపూరిత కార్యకలాపాలలో ఇండియన్ బ్యాంక్ మరియు జియోలపై ఆరోపణలు చేశారు.

అక్టోబర్ 25, 2021న బాధితులు చందర్ ఈ అనధికార లావాదేవీలను కనుగొన్నారు. వెంటనే ఇండియన్ బ్యాంక్ తో పాటు స్థానిక పోలీసులకు సంఘటనను నివేదించారు. 10 లక్షల మేర నిధులు గుర్తుతెలియని ICICI బ్యాంక్ ఖాతాకు బదిలీ అయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో చందర్ నెట్ బ్యాంకింగ్ లావాదేవీ పాస్‌వర్డ్ జనరేషన్ సంబంధించి ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చిన అనుమానాస్పద ఇ-మెయిల్‌ను గుర్తించినట్లు చెప్పారు.
తక్షణమే సమాచారం అందించినప్పటికీ ఇండియన్ బ్యాంక్ తగిన చర్య తీసుకోవడంలో విఫలమైందని ప్రెసిడెంట్ దివ్య జ్యోతి జైపురియార్ మరియు సభ్యులు గుర్తించారు. చందర్ వాదనతో వారు ఏకీభవించించారు. బాధితుని ATM కార్డును బ్యాంక్ స్తంభింపజేసింది కానీ మోసపూరిత లావాదేవీలను తిప్పికొట్టలేదని తేల్చింది.
ఈ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనలను ఉటంకిస్తూ.. అనధికారిక ఎలక్ట్రానిక్ లావాదేవీలలో కస్టమర్ బాధ్యతను రుజువు చేసే భారం బ్యాంకుపైనే ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ లావాదేవీ జరిగిన నాటి నుంచి ఏడాదికి 9 శాతం వడ్డీతో 30 రోజులలోపు 10 లక్షలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. చందర్ అనుభవించిన మానసిక వేదన మరియు వేధింపులకు గాను మరో లక్ష పరిహారంగా ఇవ్వాలని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications