మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం. మనకు ఏమైనా అయితే మనల్ని నమ్ముకున్నవారు ఇబ్బంది పడకూడదని పాలసీ తీసుకుంటాం. అయితే పాలసీ తీసుకునేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఒకవేళ ఏదైనా జరిగి క్లైమ్ చేసినప్పుడే కంపెనీ కథ తెలుస్తోంది. తాజాగా హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు. హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ క్లైమ్ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఏకంగా దొంగ పత్రాలనే సృష్టించింది.
అయితే చివరికి దొరికిపోయి అభాసుపాలయింది. బాధితుడు వినియోగదారుల కమిషన్ ఆశ్రయించడంతో హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ బండారం బయట పడింది. ఓ వైద్యుడి సంతకాలను ఫోర్జరీ చేసి ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు పత్రాలు సృష్టించిన హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ కంపెనీపై వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లైమ్ డబ్బు రూ.75 లక్షలను 7 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. 2018 నుంచి ఈ వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడానికి చెందిన భాగ్యమ్మ 2016లో హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. రూ.75 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుని సంవత్సరానికి రూ.30 వేలు చెల్లించారు. అయితే భాగ్యమ్మ 2018లో గుండె పోటుతో చనిపోయారు. ఆ తర్వాత నామినిగా ఉన్న భర్త సహదేవ ఇన్సూరెన్స్ కోసం క్లైమ్ చేశాడు. అయితే హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ సహదేవ క్లైమ్ ను తిరస్కరించింది.
భాగ్యమ్మకు పాలసీ తీసుకోకముందే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆమె యాంజియో ప్లాస్టీ చేసుకున్నట్లు తమ విచారణ తేలిందని క్లైమ్ ను రిజెక్ట్ చేసింది. దీనిపై సహదవే వినియోగదారుల కమిషన్ కు వెళ్లారు. హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ భాగ్యమ్మ పాలసీ తీసుకునేటప్పుడు అనారోగ్య సమస్యలు దాచినట్లు వాదించింది. భాగ్యమ్మ 2015 జూన్ 15 నుంచి 19 వరకు సిగ్మా అనే ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు వివరించింది. అందుకు సంబంధించిన పత్రాలు కూడా సమర్పించింది. సహదేవ మాత్రం తన భార్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. తాము సిగ్మా ఆస్పత్రికే వెళ్లలేదని వాదించాడు.
చికిత్స తీసుకున్న అని చెబుతున్న వైద్యుడిని పిలిచి విచారించాలని కోరాడు.దీంతో వినియోగదారుల కమిషన్ సిగ్మా వైద్యు అనూప్రోమన్ విచారించగా.. తాను 2015లో సిగ్మా ఆస్పత్రిలోనే లేనని.. తాను 2016లో ఆ ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. డాక్యూమెంట్స్ పై ఉన్న సంతకం కూడా తనది కాదని చెప్పాడు. హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ వాదనకు రాలేదు. సమయం ఇచ్చినా వాదనలు వినిపించలేదు. దీంతో వినియోగదారుల కమిషన్ పై విధంగా తీర్పు ఇచ్చింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications