వాటితో భారీ దెబ్బ.. భారత్ ఆర్థికమాంద్యంలోకి వెళ్తుందా?

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‍‌లో భారత జీడీపీ 23.9 శాతం క్షీణించింది. కరోనా కారణంగా వ్యవసాయం మినహా అన్ని రంగాలు సంకోచాన్ని నమోదు చేశాయి. నిర్మాణ రంగం 50.3 శాతం పడిపోగా, ఉత్పాత్తి పరిశ్రమ 39 శాతం మేర క్షీణించింది. వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్, సేవా రంగాలు 47 శాతం మేర ప్రతికూలతను నమోదు చేశాయి. తాజా ఏప్రిల్-జూన్ క్వార్టర్ క్షీణత భారత జీడీపీలోనే వరస్ట్ రికార్డ్. 2019-20లో ఇదే క్వార్టర్‌లో 5.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్ నెలలో తిరిగి కార్యకలాపాలు కోలుకున్నప్పటికీ, జూలైలో తిరిగి చాలా వరకు నిలిచినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పునరుద్ధరణ ఇంకా పుంజుకోలేదని ఆర్థికవేత్తలు అంటున్నారు.

ఆర్థికమాంద్యంలోకి వెళ్లకపోవచ్చు కానీ

ఆర్థికమాంద్యంలోకి వెళ్లకపోవచ్చు కానీ

విద్యుత్-ఇంధన వినియోగం ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తి రికవరీని అంచనా వేయవచ్చు. జూన్ క్వార్టర్‌లో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్-జీవీఏ క్షీణించింది. దేశం అధికారికంగా మాంద్యంలోకి వెళ్లకపోవచ్చు. ఎందుకంటే ఇది రెండు వరుస త్రైమాసికాలలోని జీడీపీ ప్రతికూలత నమోదు ద్వారా వెల్లడవుతుంది. కానీ బలహీన పెట్టుబడులు, క్యాపిటల్ స్పెండింగ్స్, వినియోగ డిమాండ్ వంటివి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. పైగా సంఘటిత రంగం భారీగా క్షీణించింది. అసంఘటిత రంగం ఇంతకంటే ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. మహమ్మారి కారణంగా డేటా సేకరణపై కూడా ప్రభావం ఉంటుంది. నిర్మాణ రంగంలో మైనస్ 50.3 శాతం, ట్రేడ్ అండ్ హోటల్ మైనస్ 47 శాతం, ఉత్పత్తి మైనస్ 39.3 శాతం, ఇండస్ట్రీస్ మైనస్ 38.1 శాతం, మైనింగ్ మైనస్ 23.3 శాతంగా నమోదయింది.

మాంద్యం కాస్త భిన్నంగా..

మాంద్యం కాస్త భిన్నంగా..

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) ప్రకారం లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులు, ఉద్యోగుల వేతనాలపై అధిక ప్రభావం చూపాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఏప్రిల్-జూలై మధ్య ఉద్యోగ నష్టం 18.9 మిలియన్లుగా ఉంటుందని అంచనా. కరోనా కలిగిన ఈ మాంద్యం స్వాతంత్రానంతరం నాలుగోది అని, సరళీకరణ తర్వాత మొదటిది అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గత ఏడు దశాబ్దాల్లో 1958, 1966, 1980లో భారత్ మూడుసార్లు మాంద్యాన్ని చూసింది. ఈసారి మనం చూసే మాంద్యం భిన్నంగా ఉండనుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కీలకమైన వ్యవసాయ రంగం ఈసారి పుంజుకోనుండటం ఊరట కలిగించే అంశం. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో వ్యవసాయం, అటవీ, ఫిషింగ్ పరిశ్రమ మాత్రమే 3.4 శాతం వృద్ధిని సాధించాయి.

బ్రిటన్... భారత్

బ్రిటన్... భారత్

జీ20 దేశాల్లో ఈ క్వార్టర్‌లో అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతిన్నది భారత్. ఇప్పటి వరకు బ్రిటన్ 21.7 ప్రతికూలత వృద్ధిని నమోదు చేసి ప్రపంచంలోనే అత్యంత దారుణ మాంద్యంలోకి వెళ్లిన దేశంగా నిలిచింది. మన దేశంలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పీఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో సేల్స్ వంటివి ఈ క్వార్టర్‌లో దారుణంగా పడిపోయాయి. ఐఐపీ 36 శాతం ప్రతికూలత నమోదు చేయగా, కమర్షియల్ వెహికిల్ సేల్స్ 84.8 శాతం మేర పడిపోయాయి. ప్రజావ్యయాన్ని పెంచడం ద్వారా రికవరీని వేగవంతం చేయవచ్చునని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మెకెన్సీ నివేదిక ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగాలు వేగంగా కోలుకునే అవకాశం ఉంది.

మాంద్యంలోకి వెళ్తుందా?

మాంద్యంలోకి వెళ్తుందా?

2019-20 ఆర్థిక సంవత్సరంలోని చివరి క్వార్టర్ (జనవరి-మార్చి)లో జీడీపీ 3.1 శాతం నమోదయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 23.9 శాతం తిరోగమనం నమోదయింది. 1996లో భారత్ క్వార్టర్లీ జీడీపీ గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి ఇది అత్యంత పతనం. వచ్చే క్వార్టర్‌లోను ప్రతికూలత నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఉంటే మాత్రం ఆర్థికమాంద్యం ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండు క్వార్టర్‌లలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతే మాంద్యంగా పరిగణిస్తారు. వచ్చే క్వార్టర్‌లోను అదే జరిగితే 1980 తర్వాత తొలి ఆర్థిక మాంద్యం అవుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+