Modi 3.0: మోదీ మ్యానియాతో రాహుల్ గాంధీకి రూ.47 లక్షలు లాభం.. పూర్తి వివరాలు
Rahul Gandhi: మోదీ మూడోసారి అధికారంలోకి రావటం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సైతం భారీగానే లాభాలు తెచ్చిపెట్టింది. అవునండీ బాబు వాస్తవానికి లోక్ సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి కేంద్రంలో మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందనే అంచనాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ బుల్ ర్యాలీని చూసిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో గడచిన 5 నెలల కాలంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారతీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా తన పెట్టుబడుల నుంచి రూ.46.49 లక్షలు లాభం పొందినట్లు తాజా డేటా ప్రకారం వెల్లడైంది. మార్చి 15, 2024న స్టాక్ మార్కెట్‌లో రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు రూ.4.33 కోట్లుగా ఉంది. అయితే స్టాక్ మార్కెట్లు మోదీ సర్కార్ గెలుపు ర్యాలీతో పెరుగుదల వల్ల ఆగస్టు 12, 2024 నాటికి రూ.4.80 కోట్లకు పెరిగినట్లు వెల్లడైంది.

రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీచేస్తున్న క్రమంలో దాఖలు చేసిన నామినేషన్‌లో తాను హోల్డ్ చేస్తున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియోలో.. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దీపక్ నైట్రేట్, దివిస్ ల్యాబ్స్, జీఎమ్ఎమ్ పిఫ్రాడ్లర్, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, టైటాన్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా, LTIMindtree వంటి స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు.
రాహుల్ గాంధీ తన స్టాక్ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 24 కంపెనీల షేర్లు హోల్డ్ చేస్తున్నప్పటికీ.. కేవలం LTI Mindtree, Titan, TCS, Nestle India స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో రాహుల్ హోల్డ్ చేసిన వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ షేర్ ధర మార్చి 15, 2024న రూ.260 నుంచి ప్రస్తుతం ఒక్కోటి రూ.5,200కి పెరిగింది. అయితే ప్రస్తుతం సెబీ చీఫ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ మోపిన ఆరోపణలపై జెపీసీ విచారణను ప్రకటించాలని రాహుల్ గాంధీ ఆదివారం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేడు బెంచ్‌మార్క్ సూచీలు చాలా వరకు ఫ్లాట్‌గా ముగియడంతో పెట్టుబడిదారులు తాజా హిండెన్‌బర్గ్ ఆరోపణలను తొలగించారు.


Click it and Unblock the Notifications