Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేర రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై మాటల తూటాలు ఎక్కుపెట్టారు. గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కటేనని ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థను అదానీ గ్రూప్ దెబ్బతీస్తోందిని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కంపెనీలు ఇటీవల కుప్పకూలటంతో చాలా మంది ఇన్వెస్టర్లు లక్షల కోట్ల పెట్టుబడులను నష్టపోయిన తరుణంలో ఈ కామెంట్స్ ప్రధాన్యం సంతరించుకున్నాయి.
దేశానికి వ్యతిరేకంగా..
అదానీ మొత్తం సంపదను కార్నర్ చేస్తూ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. అదానీతో ప్రధానికి ఉన్న సంబంధాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే.. తమ ప్రసంగాన్ని రద్దుచేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీజీ నిజాలు బయటకు వచ్చే వరకూ తాము పార్లమెంటులో ఇదే విషయాన్ని వేలసార్లు అగుడుతామని, దీనిని ఇక్కడితో విడిచేది లేదని రాహుల్ స్పష్టం చేశారు.

రికార్డుల నుంచి తొలగింపు..
అదానీ-మోదీలకు ఉన్న రహస్య సంబంధం గురించి ఫిబ్రవరి 7న లోక్‌సభ ప్రసంగంలో రాహుల్ ప్రశ్నించారు. ఈ ప్రసంగంలోని కొన్ని భాగాలను స్పీకర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. దేశంలోని మొత్తం మౌలిక సదుపాయాలను లాక్కుంటోందని, అదానీ కంపెనీ దేశాన్ని బాధకు గురిచేస్తోందని అన్నారు.

దేశ స్వాతంత్య్రం..
భారత్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి స్వాతంత్య్రం పొందటం కోసం పెద్ద పోరాటం చేసిన సంగతిని రాహుల్ ఈ సందర్బంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అదానీ విషయంలోనూ ఇదే చరిత్ర పునరావృతం అవుతోందని రాహుల్ పేర్కొన్నారు. అన్ని సంపదలు, ఓడరేవులు అదానీ చేలితోకి వెళ్లిపోవటం దేశానికి వ్యతిరేకమైనదని.. కాంగ్రెస్ దీనికి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతుందని రాహుల్ చెప్పారు.

రక్షిస్తున్న ప్రధాని..
బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయకుండా ప్రధాని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని గతంలోనూ రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. బూటకపు కంపెనీలను ఏర్పాటు చేసి అదానీ డబ్బు దారి మళ్లిస్తున్నప్పటికీ దానిపై ప్రధాని మోదీ మాట్లాడటం లేదని ఆయన అన్నారు. ఇలా ప్రధాని అదానీని రక్షిస్తున్నారని స్పష్టం తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications