అమెరికాకు చెందిన టెక్నాలజీ సేవల సంస్థ బ్లూజే సొల్యూషన్స్ ఇండియా తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. హైటెక్ సిటీ వద్ద సలర్‌పురియా సత్వా నాలెడ్జ్ సిటీ ఐటీ పార్కులో ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఆఫీస్‌ను కంపెనీ సీఈవో ఆండ్రూ కిర్క్‌వుడ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ చంద్ర మేదసాని సంయుక్తంగా ప్రారంభించారు.
హైదరాబాదులో 300 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తారు. పరిశోధన - అభివృద్ధి, ఆర్థిక, వినియోగదారులకు, వృత్తిపరమైన సర్వీసులు, క్లౌడ్ సేవలను అందిస్తామని సీఈవో ఆండ్రూ తెలిపారు. బ్రిటన్ ప్రధాన కేంద్రంగా పని చేసే తమ సంస్థకు భారత్‌తో పాటు అమెరికా, సింగపూర్, చైనా, నెదర్లాండ్స్ తదితర పద్నాలుగు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయన్నారు.

హైదరాబాదులో అతిపెద్ద కేంద్రం
వంద దేశాల్లో తమ కంపెనీకి 7,500 మంది కస్టమర్లు ఉన్నారని, 40,000కు పైగా సరఫరా సేవలను అందించే భాగస్వాములు ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ కేంద్రం అతి పెద్ద కేంద్రాల్లో ఒకటని, దీనిని 36 వేల చ.అ.లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఏడాదిలో 350 ఉద్యోగాలు
ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు పని చేస్తారని, ఏడాది కాలంలో మరో 50 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకుంటామన్నారు. అంతర్జాతీయంగా మొత్తం 1,200 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు భారత్‌లో ఏడు మిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టామన్నారు. సప్లై చైన్‌లో పని చేసే సంస్థలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

భారత్‌లో భారీ పెట్టుబడులు
భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామన్నారు. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సరుకు రవాణాదారులకు, తయారీ, లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ నూతన సెంటర్ ద్వారా సేవలు అందిస్తామన్నారు. ప్రస్తుతం సంస్థకు అమెరికా, బ్రిటన్, భారత్, సింగపూర్, చైనా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌లలో కార్యాలయాలను నిర్వహిస్తోంది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications