Campus Interviews: గతంలో చదువులు పూర్తి కాకుండానే ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆయా కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేవి. కానీ కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉన్న ఉద్యోగాలకే గ్యారెంటీ లేక ఎప్పుడు లేఆఫ్స్ అంటారో అని భయపడి చస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దుస్థితి గురించి కీలక నివేదిక వెలువడింది.
భారతీయ కళాశాలల్లో కేవలం 7 శాతం మాత్రమే పూర్తి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ను సాధిస్తున్నట్లు అన్‌స్టాప్ టాలెంట్ 2024 వార్షిక నివేదికలో వెల్లడైంది. భారీ సంఖ్యలో రిక్రూట్‌మెంట్స్ లేకపోవడానికి ప్రధాన కారణం నైపుణ్యలేమి సహా సరైన ప్రతిభను కనుగొనలేకపోవడమేనని రిపోర్ట్ పేర్కొంది. విద్యార్థుల, రిక్రూటర్ల ఆలోచనా విధానంలో భారీ స్థాయిలో తేడా ఉన్నట్లు కనుగొంది.

నివేదిక ప్రకారం.. 91 శాతం మంది విద్యార్థులు తమ కళాశాల పాఠ్యాంశాలు ఉద్యోగానికి తగిన స్థాయిలో సిద్ధం చేస్తున్నాయని నమ్ముతున్నారు. కానీ 66 శాతం మంది రిక్రూటర్‌లు మరియు 42 శాతం మంది విశ్వవిద్యాలయ భాగస్వాములు.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో నైపుణ్య అంతరం, సన్నద్ధత లేకపోవడాన్ని ప్రధాన సవాళ్లుగా చెబుతున్నారు.
88 శాతం మంది HR ప్రాక్టీషనర్లు అభ్యర్థుల సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తారని రిపోర్ట్ కనుగొంది. నైపుణ్యం, గత అనుభవం, విద్యార్హతలు, రిఫరెన్స్‌లు, ఇంటర్న్‌షిప్‌లు మరియు ప్రాజెక్ట్‌లు వంటివి తరువాతి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 11 వేల మంది విద్యార్థులు, విశ్వవిద్యాలయ భాగస్వాములు మరియు HR సిబ్బందిపై చేసిన సర్వే నుంచి ఈ సమాచారం సేకరించిబడినట్లు తెలుస్తోంది.
'విద్యార్థులు మరియు HR నిపుణుల ప్రాధాన్యతలు, ఆందోళనలను హైలైట్ చేయాలని భావిస్తున్నాం. టాలెంట్ సరఫరా మరియు డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గిస్తూ, మరింత సమాచారంతో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించడమే మా లక్ష్యం. మరింత సమర్థవంతమైన నియామక ప్రక్రియను ప్రోత్సహించడం ధ్యేయంగా పనిచేస్తున్నాం' అని అన్‌స్టాప్ ఫౌండర్ మరియు CEO అంకిత్ అగర్వాల్ తెలిపారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications