Retirement schemes: జీవిత చరమాంకంలో ఆర్థిక స్వాతంత్ర్యం కోసం పలువురు నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే మరి కొందరు ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఈ రెండు ఉత్పత్తులు కూడా దాదాపు ఓకే రకమైన విభాగాల్లోకి నగదును ఇన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఈక్విటీ, డెట్, గవర్నమెంట్ మరియు కార్పొరేట్ బాండ్స్ వంటి వాటిలోకే ఈ మొత్తం వెళ్లి చేరుతుంది.
ELSS మ్యూచువల్ ఫండ్స్ మరియు NPS రెండు కూడా ట్యాక్స్ సేవింగ్స్‌కు మార్గాలే. అయితే లాక్-ఇన్ పీరియడ్ విషయంతలో వీటి మధ్య తేడా ఉంటుంది. మూడేళ్ల కాలానికి గాను ELSS ఫండ్స్ బ్లాక్ చేయబడతాయి. అనంతరం కావలసినప్పుడు యూనిట్లను విక్రయించడం ద్వారా పెట్టుబడిని తిరిగి నగదుగా మార్చుకోవచ్చు. కానీ NPS విషయంలో అలా ఉండదు. 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. తదనంతరమే పెట్టుబడిని ఉపసంహరించుకునే వీలుంటుంది.

లాక్-ఇన్ పీరియడ్ తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ELSS అంత సౌకర్యవంతంగా ఉండదని నిపుణుల భావన. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు పెట్టుబడిని బ్రేక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ELSS ముడేళ్ల లాక్-ఇన్ అనంతరం అందుకు అవకాశం కల్పిస్తుంది. కానీ NPS మాత్రం 60 ఏళ్ల వరకు ఉపసంహరణ ఆలోచన రానీయదు. 60 ఏళ్ల తర్వాత జమ అయిన మొత్తంలో ఒక్కసారిగా 60 శాతం మొత్తాన్ని చేతికి ఇస్తుంది. రిటైర్‌మెంట్ అనంతరం ఆర్థిక అవసరాల కోసం మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ రూపంలో తిరిగి అందిస్తుంది.
రెండు ఉత్పత్తులూ దీర్ఘకాలంలో మంచి రాబడి ఇచ్చేవి మరియు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేవి. పెట్టుబడిదారుల లక్ష్యం షార్ట్ టర్మ్ అయితే ELSS, లాంగ్ టర్మ్ అయితే NPSను పలువురు ఆర్థిక నిపుణులు రికమండ్ చేస్తున్నారు. పాత మరియు కొత్త పన్ను విధానాల ఆధారంగా కూడా ఈ దృక్పథం మారే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త విధానంలో ELSS అనే దానికి అవకాశమే లేదు. కానీ NPS మాత్రం రెండు రెజీమ్‌లలోనూ కీలక రోల్ పోషిస్తుంది.


Click it and Unblock the Notifications