Chicken, Egg Price: నాజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు..!

చాలా మందికి సండే వచ్చిందంటే.. ముక్క లేనిదే బుక్క దిగదు. చాలా మంది నాన్ వెజ్ తెచ్చుకుంటారు. అయితే మటన్ కిలో రూ. 800 నుంచి రూ.1000 ఉంది. ఇక చేపలకు కూడా భారీగానే ధర ఉంది. పైగా కొంత మంది చేపలు తినరు. అయితే దాదాపు అందరు తినే నాన్ వెజ్ చికెన్. సండే రాగానే చాలా మంది చికెన్ తెచ్చుకుంటారు. లేదంటే కోడి గుడ్లు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు చికెన్ ధర, కోడి గుడ్ల ధర భారీగా పెరిగింది. కొద్ది రోజులు చికెన్, కోడి గుడ్ల ధర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓ సినిమా సన్నివేశం గుర్తొస్తుంది. అహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాస రావు తాడుకు కోడిని వేలాడదీసి కంచంలో అన్నం పెట్టుకుని తిట్టాడు.

ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుదంని కొంత మంది సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 350 వరకు పలుకుతుంది. హైదరాబాద్ లో కిలో చికెన్ హోల్ సేల్ రూ. 320 నుంచి రూ.330 వరకు నడుస్తోంది. ఇక రిటైల్ లో కిలో చికెన్ రూ. 340 నుంచి రూ.350 వరకు పలుకుతుంది. దీంతో చాలా మంది కిలో చికెన్ తెచ్చుకునే వారు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఇక కోడి గుడ్ల ధర కూడా కొండెక్కింది. రిటైల్ లో ఒక్కో గుడ్డు రూ. 8 నుంచి రూ.8.50 లకు విక్రయిస్తున్నారు.

chicken

హోల్ సేల్ లో ఒక్కో గుడ్డు రూ. 7 నుంచి రూ.7.50 లకు తీసుకుంటున్నారు. ఒకప్పుడు రూ. 66 నుంచి రూ.76 లకు డజన్ కోడి గుడ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు డజన్ కోడి గుడ్ల ధర రూ.100 లకు చేరింది. దీంతో చాలా మంది కోడి గుడ్లు కొనుగోలు చేయడం తగ్గించారు. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా చాలా చోట్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ ధర పెంచారు. చికెన్ ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. నిన్నా మొన్నటి వరకు వేసవి కాలం కావటంతో తీవ్రమైన వేసవి కారణంగా కోళ్ళ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని వివరిస్తున్నారు.

పౌల్ట్రీ ఫీడ్ ధరలు భారీగా పెరిగాయి. ఇందుకు తోడు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో మార్కెట్‌లో కూడా చికెన్ కు బాగా డిమాండ్ పెరిగిందని అందుకే ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. సరఫరా తగ్గడంతో పాటు డిమాండ్ పెరగటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయన్నారు. లైవ్ బర్డ్ ధరలు పెరగడం, రిటైల్ మార్కెట్ ఖర్చులు కూడా ఈ పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+