For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST Hike: జీఎస్టీ అమలుతో వంటగది పెరిగిన బడ్జెట్.. సామాన్యుల ఆగ్రహం.. ఏమంటున్నారంటే..

|

కొత్తగా పెరిగిన జీఎస్టీ రేట్లు నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. అయితే దీనిపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ఈ పెంపు వల్ల తమ వంటగది బడ్జెట్ రూ.5 వేల నుంచి రూ.7 వెలకు పెరిగిందని దిల్లీలోని కమలానగర్ కు చెందిన ఒక మహిళ వాపోయారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. ఆదాయాలు పెరగకపోయునా ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని.. జీవనం కష్టంగా మారుతోందని అనేక మంది మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కొత్తగా ఈ ఉత్పత్తులపై జీఎస్టీ..

కొత్తగా ఈ ఉత్పత్తులపై జీఎస్టీ..

జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులపై తొలిసారిగా కేంద్రం పన్ను విధించింది. ఇందులో భాగంగా పలు ఆహార పదార్థాలన్నింటిపై 5% జీఎస్టీ విధించింది. ఇది నేరుగా సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతుంది. పాలు, పెరుగు, పనీర్, లస్సీ, తేనె, డ్రై మఖానా, డ్రై సోయాబీన్, బఠానీలు, గోధుమలు, పఫ్డ్ రైస్ వంటి ఉత్పత్తులపై ఇప్పుడు 5 శాతం జీఎస్టీ వసూలు చేయబడుతోంది.

నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ..

నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ..

దిల్లీలోని శక్తి నగర్‌లో నివసించే సంజీవ్ గోయల్ కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆహార పదార్థాలపై తొలిసారిగా విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే.. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే సామాన్యుల వెన్ను విరిగిపోయిందని ఆయన అంటున్నారు.

వ్యాపారులు ఏమంటున్నారంటే..

వ్యాపారులు ఏమంటున్నారంటే..

కమలా నగర్‌లో కిరాణా దుకాణం నడుపుతున్న సంజయ్ గుప్తా ప్రకారం.. అతను గత 40 సంవత్సరాలుగా తన దుకాణాన్ని నడుపుతున్నాడు. కరోనా కాలంలో.. వ్యాపారంలో సగానికి పైగా ఆన్‌లైన్‌కి మారినట్లు ఆయన అన్నారు. అదనపు జీఎస్టీ వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. వ్యాపారులు చాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ట్రీస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీలోని అన్ని వ్యాపార తరగతుల మహాపంచాయత్ బుధవారం సమావేశమైంది.

ఢిల్లీ గూడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్

ఢిల్లీ గూడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్

ప్రభుత్వం అమలు చేసిన కొత్త జీఎస్టీ రేట్లు తమకు పెద్ద ఊరటనిచ్చాయని ప్రెసిడెంట్ రాజేంద్ర కపూర్ అన్నారు. ట్రాన్స్‌పోర్టర్‌కు ముందు 2 రకాల పన్నులు వసూలు చేశారని, దానిని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం అభినందనీయమని అన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి వ్యాపారం చేసుకునే వ్యాపారులు హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి రావటం భారంగా మారిందని సందీప్ ఖండేల్వాల్ అనే వ్యాపారి అన్నారు.

Read more about: gst జీఎస్టీ
English summary

GST Hike: జీఎస్టీ అమలుతో వంటగది పెరిగిన బడ్జెట్.. సామాన్యుల ఆగ్రహం.. ఏమంటున్నారంటే.. | common man and retail business people serious over gst rate hike amid inflation

common man and retail business people serious over gst rate hike
Story first published: Tuesday, July 19, 2022, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X