IPO News: చిన్న ఐపీవో సంచలనం.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్.. బంపర్ లిస్టింగ్..
IPO News: ఈవారం మార్కెట్లో ఐపీవోల సందడి కొంత తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అయితే నేడు వచ్చిన చిన్న ఐపీవో చిచ్చరపిడుగులా ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కమిటెడ్ కార్గో కేర్ ఐపీవో గురించే. ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలను అందించే కంపెనీ స్టాక్ పెద్ద లాభాలను షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు అందించింది. రూ.77 రేటుకు ఇష్యూ అయిన స్టాక్ మార్కెట్లో రూ.82 రేటు వద్ద ప్రీమియం ధరకు లిస్టింగ్ అయ్యింది. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా అయిన స్టాక్ కొద్ది సేపటికే 5 శాతం అప్పర్ సర్క్యూట్ ధర రూ.86.10ను తాకింది.

ఐపీవో సబ్‌స్క్రిప్షన్ సమయంలో పెట్టుబడిదారుల నుంచి అపూర్వమైన స్పందనను పొందింది. దీంతో IPO 87 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ కోటా 78.73 రెట్లు, ఇతర కేటగిరీల్లో సబ్‌స్క్రిప్షన్ 94.20 రెట్లుగా నమోదైంది. ఐపీవోకి ముందర కంపెనీలో 98 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 68.63 శాతానికి తగ్గింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.24.98 కోట్లను సమీకరించింది.
ఐపీవోలో పెట్టుబడి పెట్టేందుకు లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే ఒక లాట్ కొనుగోలుకు రూ.1,23,200 వెచ్చించారు. కమిటెడ్ కార్గో కేర్ ఐపీవో 6 అక్టోబర్ 2023న ప్రారంభమై అక్టోబర్ 10న ముగిసింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలను అందించే కంపెనీ 1998లో ప్రారంభమైంది. కార్గో దిగుమతి, ఎగుమతిలో ప్రత్యేకత కలిగి ఉంది.


Click it and Unblock the Notifications