Nestle India: పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు పెట్టే మెుదటి ఆహారం సెరెలాక్. నెలల వయస్సు పిల్లలకు ఇచ్చే బేబీ ఫుడ్ లో చక్కెర గుర్తించబటం ప్రస్తుతం నెస్లేకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. మ్యాగీ వివాదం నుంచి ఇటీవల బయటపడ్డ కంపెనీకి కొత్త కష్టాలు చుట్టుముట్టాయి.
వాస్తవానికి పేద దేశాల్లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉన్నట్లు స్విస్ పరిశోధనా సంస్థ చేపట్టిన పరీక్షలో వెల్లడైంది. అయితే కంపెనీ ఉత్పత్తుల క్వాలిటీ విషయానికి వస్తే యూకే, అమెరికా వంటి ధనిక దేశాల్లో ఒక విధంగా.. ఇండియా, ఆఫ్రికా వంటి దేశాల్లో మరో విధంగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. నైజీరియాలో చక్కెర స్థాయి ఏకంగా 6.8 గ్రాముల వరకు ఉండటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.

బయటపడ్డ సంచలన విషయాలపై.. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(NCPCR) నెస్లే బేబీ మిల్క్ అండ్ సెరెలాక్‌లో అదనపు చక్కెర సమస్యపై నివేదికను పరిగణనలోకి తీసుకుని FSSAIకి నోటీసు జారీ చేసింది. భారతదేశం వంటి దేశాల్లోని నెస్లే బేబీ మిల్క్, సెరెలాక్ వంటి ఆహార ఉత్పత్తులలో చక్కెర, తేనె కలుపుతున్నట్లు స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్(IBFAN) చేసిన దావాపై ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) దర్యాప్తు చేస్తోంది. FSSAI కనుగొన్న వాటిని దర్యాప్తు చేసి తదుపరి చర్య కోసం అంతర్గత శాస్త్రీయ ప్యానెల్‌తో విచారణ నివేదికను సమర్పిస్తామని తెలిపింది.
ప్రియాందక్ కనుంగో నేతృత్వంలోని ఎన్‌సీపీసీఆర్.. నెస్లేతో పాటు ఇతర కంపెనీలు తయారు చేసి విక్రయించే బేబీ ఫుడ్ ఉత్పత్తుల్లో చక్కెరపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని FSSAIని కోరింది. ఉత్పత్తులు రెగ్యులేటర్ ద్వారా ధృవీకరించబడ్డాయా, అవి ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా తనిఖీ చేయబడుతుంది. బేబీ ఫుడ్ ఉత్పత్తులలో చక్కెర జోడించటం శిశువు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని నేషనల్ కమిషన్ పేర్కొంది.
ప్రస్తుత సమస్యపై నెస్లే ఇండియా స్పందించింది. గడచిన ఐదేళ్లలో తమ ఉత్పత్తుల్లో చక్కెర స్థాయిలను 30 శాతం మేర తగ్గించినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే తమ పోర్ట్‌ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షిస్తామన్నారు. కంపెనీ తన ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రత, రుచికు ప్రాధాన్యతనిస్తామని, వీటి విషయంలో రీజీపడే సమస్యే లేదని పేర్కొంది. భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులు జోడించిన చక్కెరలతో సహా అన్ని పోషక అవసరాలకు సంబంధించిన కోడెక్స్ ప్రమాణాలను పాటించటంలో ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాయని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అయితే సంచలన నివేదికతో నెస్లే కంపెనీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications