Bonus Multibagger: స్మాల్ క్యాప్ కంపెనీ సిన్ బ్యాగ్స్ లిమిటెడ్ దీపావళికి ముందు పెట్టుబడిదారులకు భారీ బహుమతిని అందించింది. ఇప్పటికే మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ఈ స్టాక్.. ప్రస్తుతం తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ప్రకటించింది.

బోసన్ షేర్లు..
కంపెనీ 22 అక్టోబర్ 2022న బోనస్ షేర్లను ప్రకటించింది. అర్హత కలిగిన పెట్టుబడిదారులకు ఇవి అందనున్నాయి. కంపెనీ బోర్డు నిర్ణయం మేరకు ఒక్కో షేరుకు గాను రెండు బోనస్ షేర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్త వెలువడటంతో శనివారం స్టాక్ బీఎస్ఈలో ఏకంగా 5 శాతం పెరిగి రూ.304.80 వద్ద ముగిసింది.

రూ.10 ఫేస్ వ్యాల్యూ..
రూ.10 ఫేల్ వ్యాల్యూ ఉన్న ఒక్కో షేరుకు రెండు బోనస్ షేర్లను అందిస్తున్నట్లు కంపెనీ బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అయితే దీనికి సంబంధించి రికార్డు తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కంపెనీ డిసెంబర్ 21, 2022లోపు లేదా అంతకు ముందే ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించనున్నట్లు సమాచారం. అంటే రికార్డు తేదీని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

మల్టీబ్యాగర్ రాబడులు..
గత 5 సంవత్సరాల్లో కంపెనీ పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఈ కాలంలో కంపెనీ షేర్ ధర 571.37 శాతం పెరిగింది. అదే విధంగా 3 ఏళ్ల రిటర్న్స్ పరిశీలిస్తే.. కంపెనీ స్టాక్ 606 శాతం లాభపడింది. గత ఏడాది కాలంలో కంపెనీ షేర్లు 100.07 శాతం ఎగబాకి పెట్టుబడి విలువ డబుల్ అయింది. 2022లో ఇప్పటివరకు సిన్ బ్యాగ్స్ లిమిటెడ్ షేర్ 13.77 శాతం పెరిగింది.

మార్కెట్ క్యాప్..
కంపెనీలో ప్రమోటర్లు 58.66 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.406 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర 146.05 ఉండగా.. షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.329గా ఉంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠానికి దగ్గరకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది.

కంపెనీ వ్యాపారం..
కంపెనీ 1984లో స్ఠాపించబడింది. కంపెనీ FIBC బిగ్ బ్యాగ్స్, ఫుడ్ గ్రేడ్ FIBCలను ఉత్పత్తి, ఎగుమతి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇండోర్‌లో ఉంది. ప్రస్తుతం కంపెనీ అంతర్జాతీయంగా.. UK, బెల్జియం, హంగేరీ, సెనెగల్, థాయిలాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, USA, డెన్మార్క్, ఆస్ట్రేలియా, స్పెయిన్ వంటి అనేక దేశాల మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉనికిని కలిగి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications