కమర్షియల్ సిలిండర్ ధరలు నేడు భారీగా పెరిగాయి. ఒక్కో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పైన రూ.102.50 పెంచుతూ ఇంధన సంస్థలు ఆదివారం ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,562.50కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధర రూ.2355.50గా ఉంది. ఐదు కిలోల సిలిండర్ ధర రూ.655కి చేరుకుంది.
కమర్షియల్ సిలిండర్ ధరను గత నెలలోనే రూ.250 చొప్పున పెంచారు. ఇప్పుడు మరో రూ.102.50 చొప్పున బాదేశారు. మార్చిలోను సిలిండర్ పైన రూ.105కు పెంచారు. దీంతో చిరు వ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే రూ.3000 వరకు అదనంగా ఖర్చు చేయవలసి వస్తుంది.

అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. చమురు సంస్థలు గత నెలలోను ఈ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుత ధరల ప్రకారం 14.2 కిలోల సిలిండర్ హైదరాబాద్‌లో రూ.1002, కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50, ఢిల్లీలో 949.50, ముంబైలో రూ.949.50గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications