చమురు సంస్థలు సామాన్యులకు శుభవార్త చెప్పాయి. వంట గ్యాస్ ధరలను తగ్గించాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.92 లకు తగ్గించారు. అయితే గత సంవత్సరం గృహ వినియోగ LPG సిలిండర్ల రేటును నాలుగు సార్లు పెంచారు. మార్చిలో డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ. 50 పెంచగా.. వాణిజ్య సిలిండర్ ధరను రూ. 350 పెంచారు.
ఈ సంవత్సరం జనవరిలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.25 పెరిగింది. తాజా రూ.92 తగ్గింపుతో కాస్త ఉపశమనం లభించనుంది. గతేడాది 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.2,253గా ఉంది. ఆ తర్వాత రూ.225 తగ్గింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం యొక్క 9.59 కోట్ల మంది లబ్ధిదారులు ప్రతి 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌పై సంవత్సరానికి రూ.200 సబ్సిడీని పొందుతారని కేంద్రం చెప్పింది.కాగా చమురు ధర వరుసగా ఐదవ నెలలో పడిపోయింది.

అయితే గృహ వినయోగ సిలిండర్ ధర తగ్గించాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రూ. గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 1155గా ఉంది. బెంగళూరులో రూ.1105, చెన్నైలో రూ.1118 గా ఉంది. గతంలో గృహ వినయోగ సిలండర్ అన్నింటిపై సబ్సిడీ ఇచ్చే వారు.. ఆ సబ్సిడీని క్రమంగా ఎత్తివేశారు. ఇప్పుడు కేవలం ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికే రూ.200 సబ్సిడీ లభించనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications