LPG Cylinder: రోజురోజుకూ బతుకు భారంగా మారుతోంది. అసలు ఒక గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంటుంది మహా అయితే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు అని మనకు తెలుసు. కానీ దాని ధర ఒక్కసారిగా రూ.10,000గా మారితే. ఈ ఊహ వినటానకే భయంకరంగా ఉంది కదా. కానీ ఇది నిజంగా అమలులో ఉందని మీకు తెలుసా..? దీనికి సంబంధించిన విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చైనా పాపాలతో..
మన పొరుగుతున్న ఉన్న శ్రీలంక పతనం మనందరం చూశాం. బంగారు లంక భవిష్యతును కోల్పోయింది. దీనికి కారణంగా చైనా అని మనందరికీ తెలుసు. ఇదే పరిస్థితి దాయాది పాక్ కు దాపురించింది. ఎప్పుడూ భారత్ పై కుట్రలు, కుతంత్రాలు నూరే పనిలో పడి తన ఆర్థిక పతనాన్ని గమనించలేకపోయింది. పైగా చైనాను నమ్ముకుని ఎకనామిక్ కారిడార్ పెట్టుబడులతో అప్పులపాలైంది. ఇప్పుడు దాని కష్టాలు మహా సంక్షోభంగా మారాయి. కరెంటు కష్టాల నుంచి ఆహారం వరకు అన్నీ అందని దాక్షలుగా మారుతున్నాయి.

ఎల్పీజీ గ్యాస్..
పాకిస్థాన్ పరిస్థితి ఎంతలా దిగజారిందంటే.. అక్కడ ప్లాస్టిక్ సంచుల్లో LPG గ్యాస్ పంపిణీ చేస్తున్నారు. చైనా అప్పుల ట్రాప్ లో చిక్కుకున్న పాక్ మరో శ్రీలంకగా మారే మార్గంలో పయనిస్తోంది. పైగా అక్కడ ఒక్కో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.10,000 పాకిస్థాన్ రూపాయలకు చేరుకుందని వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ నివాసితులు ప్లాస్టిక్ సంచుల్లో వంట గ్యాస్ నింపి తీసుకువెళుతున్నారు. LPG సరఫరాలో కొరత కారణంగా.. హంగూ వంటి అనేక నగరాల ప్రజలు కొంతకాలంగా గ్యాస్ లేకుండా జీవిస్తుంటారు

ఖజానాను కాపాడేందుకు..
డబ్బు ఆదా చేయడం, దేశ ఖజానాపై భారాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అలా ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించింది. దీనికోసం 'వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ'ని అమలు ద్వారా కరెంట్ వినియోగాన్ని తగ్గిస్తోంది. దీనికి తోడు బల్బులు, విద్యుత్ ఫ్యాన్ల ఉత్పత్తిని జూలై 2023 వరకు నిలిపివేయాలని డిసైడ్ అయ్యింది.

దివాళా దిశకు..
మార్చి 2022 నాటికి పాకిస్థాన్ మెుత్తం అప్పు దాదాపుగా 43 లక్షల కోట్లుగా ఉంది. పాక్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల గడచిన మూడేళ్లలో రోజుకు ప్రజలపై దాదాపు 1400 కోట్ల అప్పుల భారం పెరుగుతూ వచ్చింది. ఎక్కువ అప్పులు ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే అయ్యాయి. అలాగే గత నెలలో విదేశీ మారక నిల్వలు 294 మిలియన్ డాలర్లు తగ్గి 5.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం జూలై-అక్టోబర్ త్రైమాసికంలో పాకిస్తాన్ ఆర్థిక లోటు GDPలో 1.5 శాతంగా ఉంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఖ్వాజా కూడా దేశం 'తీవ్రమైన' పరిస్థితిలో ఉందని వెల్లడించటం దారణ పరిస్థితులకు అద్ధం పడుతోంది.

అప్పులతో ఆంక్షలు..
కరెంట్ వినియోగాన్ని తగ్గించటం ద్వారా ఇంధన దిగుమతిని తగ్గించాలని పాక్ నిర్ణయించింది. దీనిలో భాగంగా మాల్స్, కళ్యాణ మండపాల వేళలపై ఆంక్షలు విధించింది. ఈ చర్యల వల్ల 62 వేలకోట్ల రూపాయలు ఆదా అవుతుందన్నాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. పైగా ప్రభుత్వ సమావేశాలను పగటి పూట నిర్వహిస్తున్నారు. దీంతో కరెంట్ పొదుపు చేయటానికి వీలవుతుందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.

జీతాలకు NO క్యాష్..
పాకిస్థాన్ ఆర్థిక దుస్థితికి మరో పెద్ద సంకేతం ఏమిటంటే.. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ లేదు. రైల్వే శాఖ పరిస్థితి మరీ దారుణం. గత ఏడాది కాలంలో పదవీ విరమణ పొందిన అధికారులకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర రూ.25 వేలకోట్లు కరువయ్యాయి. పాక్ రైల్వేస్ తన ఉద్యోగులకు జీతం, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రెగ్యులర్ పెన్షన్ కూడా చెల్లించటం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు 20 రోజుల కంటే ఆలస్యంగా వస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications