Commercial Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!

వ్యాపారులకు, హోటల్ యజమానులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు (commercial cylinder price) భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,071.5 కు చేరుకుంది. అంటే వ్యాపార అవసరాల కోసం గ్యాస్ వాడే వారికి ఇది భారీ భారమనే చెప్పాలి.

Commercial cylinder price hiked by Rs 993 in May 2026 Domestic LPG and Petrol rates unchanged

ఎందుకు పెరుగుతున్నాయి ఈ ధరలు?

ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం (అమెరికా-ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ 'ఎపిక్ ఫ్యూరీ') మొదలైనప్పటి నుండి కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం ఇది మూడవసారి. మార్చిలో రూ. 115, ఏప్రిల్ 1న రూ. 200 పెరగగా.. ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయల మార్కుకు దగ్గరగా పెంపు ఉండటం కలకలం రేపుతోంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే ఈ పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కేవలం పెద్ద సిలిండర్లే కాదు, 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ ధర కూడా రూ. 261 పెరిగింది.

సామాన్యులకు ఊరట.. ఎందుకంటే..

వ్యాపార అవసరాల గ్యాస్ ధర పెరిగినప్పటికీ, సామాన్య ప్రజలు ఇంట్లో వాడుకునే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డొమెస్టిక్ సిలిండర్ ధరలు యధావిధిగా కొనసాగుతాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నాయి.

విమాన ఇంధనం , ఇతర వివరాలు

డొమెస్టిక్ విమానయాన సంస్థలకు ఇచ్చే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను కూడా చమురు సంస్థలు మార్చలేదు. విమాన ప్రయాణికులపై అదనపు భారం పడకుండా ఉండాలని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు మాత్రం ధరలు పెరిగాయి. అదేవిధంగా, రేషన్ (PDS) ద్వారా సరఫరా చేసే కిరోసిన్ ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పన్నుల్లో కోత విధించిన ప్రభుత్వం

గ్లోబల్ మార్కెట్‌ లో ముడిచమురు ధరల ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం విండ్‌ఫాల్ గెయిన్ ట్యాక్స్‌ను తగ్గించింది. డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 23, విమాన ఇంధనంపై రూ. 33 కు పన్నును తగ్గించింది. ఇది చమురు కంపెనీలకు కొంత వెసులుబాటు కలిగిస్తుంది. అయినప్పటికీ, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల వల్ల కమర్షియల్ సిలిండర్ ధరలు (commercial cylinder price) భారీగా పెరగడం అనేది మార్కెట్‌ లో వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా హోటళ్లు, క్యాంటీన్లలో భోజనం ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సామాన్యుడి జేబుకు పరోక్షంగా చిల్లు పడనుంది. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ వినియోగదారులు తమ బడ్జెట్‌ ను ప్లాన్ చేసుకోవడం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+