Quick Commerce: దేశీయంగా కిరాణా వ్యాపారంలో ఆటతీరు పూర్తిగా మారిపోతోంది. దేశంలో స్టార్టప్ కంపెనీలు వేలకోట్లు కుమ్మరిస్తూ భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రధానంగా టైర్-2,3 నగరాల్లో ఈ క్విక్ కామర్స్ కంపెనీల హవా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధానంగా ఈ రంగంలో ప్రస్తుతం జెప్టో, స్విగ్గీ ఇన్ స్టామార్ట్, బ్లింకిట్, టాటా బిగ్ బాస్కెట్, కంట్రీ డిలైట్‍తో పాటు లోకల్ యాప్స్ సైతం పుట్టుకొస్తున్నాయి. అయితే వీటి ఆట చిన్న, మధ్య తరహా కిరాణా దుకాణదారుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి.
తాజాగా బెంగళూరులో దీనికి సంబంధించి జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక జంట కిరాణా సరకులు షాపింగ్ కోసం వెళుతున్న క్రమంలో స్థానికంగా పండ్లు, కూరగాయలు విక్రయించే వ్యాపారి వద్ద ఆగారు. అయితే అతని వద్ద ధరలు క్విక్ కామర్స్ కంపెనీలు అందిస్తున్న వాటి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయని గ్రహించి కొనకుండానే వెళ్లిపోయారు. కానీ ఆన్ లైన్ కంటే సదరు వ్యాపారి వద్ద 5-6 రూపాయలు మాత్రమే ధర వ్యత్యాసం ఉన్నప్పటికీ చివరికి సదరు చిరువ్యాపారి ఆ దంపతులకు తగ్గించిన ధరలకే విక్రయించాడు. ఇదే క్రమంలో కిరాణా దుకాణంలో డిష్ వాష్ లిక్విడ్ ఆన్ లైన్ లో తక్కువ ధరకు లభిస్తుందని కిరాణా దుకాణం వ్యాపారితో మరో కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్విక్ కామర్స్ విస్తరణ కారణంగా ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి.

పట్టణాల్లో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు స్థానిక కిరాణా దుకాణాలకు కస్టమర్లను దూరం చేస్తున్నాయి. కొనుగోలుదారుల్లో మార్పులపై డాటమ్ ఇంటెలిజెన్స్ అందించిన రిపోర్ట్ పరిశీలిస్తే.. 82% మంది వినియోగదారులు తమ కిరానా కొనుగోళ్లలో కనీసం నాలుగింట ఒక వంతును క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు తరలించారు. అలాగే 5% మంది కిరాణా దుకాణాల వద్ద షాపింగ్ చేయడం పూర్తిగా ఆపివేశారు. రోజురోజుకూ ఈ ధోరణి పెరిగిపోతోందని రిపోర్ట్ చెబుతోంది. రిటైల్ వ్యాపారంలో వస్తున్న భారీ మార్పులు కిరాణా షాపుల యజమానులను బాధిస్తోంది. దీనిపై బెంగళూరులోని ఒక కిరాణా వ్యాపారి మాట్లాడుతూ క్విక్ కామర్స్ వల్ల వ్యాపారం కొంత దెబ్బతిందని, అయితే ఎక్కువగా యువత వీటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ పాత తరం ప్రజలు తమకు నచ్చిన వస్తువులను నేరుగా వెళ్లి కొనుక్కోవటానికి ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు.
పాతతరం ప్రజలు యాప్స్ ద్వారా కొనుగోలు చేయటం, వాటికోసం డెలివరీ ఛార్జీలు, హ్యాండిలింగ్ ఛార్జీలు వంటి అనేక రుసుములను చెల్లించటానికి ఇష్టపడటం లేదని తేలింది. ఇప్పటికీ దేశంలోని కిరాణా వ్యాపారంలో 92 శాతం అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద కొనసాగుతోంది. ఈకామర్స్, క్విక్ కామర్స్ కంటే వీరికి బలమైన విస్తరణ ఉండటం ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలంగా నిలబడుతోంది.
ఈ పరివర్తన మధ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల అభ్యాసాలపై హెచ్చరికలు పెంచింది. ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో భారతదేశ రిటైల్ పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల దుర్వినియోగాన్ని CAIT హైలైట్ చేసింది. విదేశీ పెట్టుబడిదారులు క్విక్ కామర్స్ కంపెనీలకు కిరాణా దుకాణాల నుంచి 25-30 శాతం మేర వ్యాపారాన్ని లాక్కోవటానికి దోహదపడుతున్నట్లు వెల్లడించింది. నగరాల్లో ఇది మరింతగా రోజురోజుకూ పెరుగుతోంది. అయితే క్విక్ కామర్స్ కంపెనీలు ప్రస్తుతం దేశంలోని 15-20 పెద్ద నగరాల్లో మాత్రమే విజయం కిరాణా దుకాణదారుల వ్యాపారాలను భారీగా దెబ్బతీస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications