IPO News: గత వారం బిజీగా గడిపిన తర్వాత ప్రైమరీ మార్కెట్ ఊపిరి పీల్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల మధ్య రాబోయే వారంలో కేవలం రెండు ఐపీవోలు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుండగా.. ఎనిమిది కంపెనీల ఐపీవోలు లిస్టింగ్ కోసం ప్రవేశిస్తున్నాయి. రానున్న వారంలో ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చేస్తున్న రెండు ఐపీవోలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Awfis Space Solutions IPO: ఈ క్రమంలో రానున్న వారంలో అవ్ఫిస్ స్పేస్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం మే 22న తెరుచుకుని మేర 27న ముగియనుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ ఏకంగా రూ.598.93 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇందులో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్ల విక్రయం కూడా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.364-383గా నిర్ణయించింది.

GSM Foils IPO: ఇక వచ్చేవారం మార్కెట్లోకి ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనున్న రెండవ ఐపీవో జీఎస్ఎమ్ ఫోలియో. మే 24న ప్రారంభం అవనున్న ఐపీవో మే 28న ముగియనుంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో మార్కెట్ల నుంచి రూ.11.01 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.ఇందుకోసం కంపెనీ 34.4 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తోంది. దీనికోసం ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.32గా కంపెనీ నిర్ణయించింది.
ఈవారం స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ కోసం సిద్ధంగా ఉన్న 8 కంపెనీల ఐపీవోల వివరాలు ఇవే..
Go Digit IPO: విరాట్ కోహ్లీ పెట్టుబడులు కలిగి ఉన్న గోడిజిట్ కంపెనీ ఐపీవో మే 23న దేశీయ మార్కెట్లలోకి లిస్టింగ్ కోసం సిద్ధంగా ఉంది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో జాబితా కానున్నాయి. షేర్ల అలాట్మెంట్ మే 21న జరగనుందని సమాచారం.
ABS Marine Services IPO: ఏబీఎస్ మేరీ సర్వీసెస్ కంపెనీ ఐపీవో షేర్ల అలాట్మెంట్ మే 16న పూర్తైంది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో మే 21న జాబితాకు వస్తున్నాయి.
Veritaas Advertising IPO: మే 21న మార్కెట్లోకి జాబితాకు సిద్ధంగా ఉన్న మూడో ఐపీవో వెరిటాస్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఐపీవో. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో అడుగుపెడుతున్న ఐపీవోలో మే 16న దరఖాస్తుదారులకు షేర్ల జాబితా పూర్తైంది.
Mandeep Auto Industries IPO: మనిదీపా ఆటో ఇండస్ట్రీస్ ఐపీవో షేర్ల అలాట్మెంట్ ఇప్పటికే మే 16న పూర్తయింది. ఈ కంపెనీ ఐపీవో సైతం మార్కెట్లో జాబితాకు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీ కింద మే 21న మార్కెట్లోకి అరంగేట్రం చేయటానికి సిద్ధంగా ఉంది.
Indian Emulsifier IPO: ఐపీవోలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఇండియా ఎమల్సిఫైయర్ షేర్ల అలాట్మెంట్ మే 17న ముగిసింది. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో కంపెనీ షేర్లు మే 22న జాబితా కానున్నట్లు సమాచారం.
Quest Laboratories IPO: క్విస్ట్ లేబొరేటరీస్ ఐపీవో సబ్ స్క్రిప్షన్ కోసం ముగిసిన తరుణంలో షేర్ల అలాట్మెంట్ మే 21న జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో కంపెనీ షేర్లు మార్కెట్లలో మే 23న జాబితా కానున్నాయని సమాచారం.
Hariom Atta & Spices IPO: స్పైసెస్ వ్యాపారానికి చెందిన హరియం కంపెనీ ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ రానున్న వారంలో మే 22న ఉండనున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో మే 24న అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
Rulka Electricals IPO: వచ్చేవారం చివరిగా మార్కెట్లో అడుగుపెట్టనున్న ఐపీవో రుల్క ఎలక్ట్రికల్స్. ఐపీవో కోసం దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లకు షేర్ల జారీ మే 22న ఉండనుందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఐపీవో లిస్టింగ్ మే 24న జరగనుందని సమాచారం.


Click it and Unblock the Notifications