Zomato News: జొమాటో బాస్‌కు కమెడియన్ అదిరిపోయే కౌంటర్.. ఒక్క పోస్ట్‌తో సౌండ్ లేదంతే..
Zomato Guiness Record: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఓ కీలక ఘట్టానికి తెరతీసింది. కేవలం ఆహారాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. తమవంతుగా సమాజ సేవ చేయడంలో ఓ అడుగు ముందుకేసింది. అత్యవసర వేళల్లో ప్రజలకు సహకారం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఒకే వేదికపై వేలాది మంది సిబ్బందికి ప్రథమ చికిత్స పాఠాలు నేర్పించి చరిత్ర సృష్టించింది. ఇలాచేసి గిన్నిసి వరల్డ్ రికార్డును నెలకొల్పినట్లు జొమాటో CEO దీపిందర్ గోయల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాగా దీనిపై ప్రముఖ హాస్యనటులు కునాల్ కమ్రా విరుచుకుపడ్డారు. సంస్థ తీరును తప్పుపడుతూ కామెంట్ చేశారు.

వారి డెలివరీ భాగస్వాముల సగటు ఆదాయం మరియు పని గంటల గురించి జొమాటో CEO ఆలోచించాలని కునాల్ సూచించారు. గత 3 నెలలకు సంబంధించి ఈ డేటా పంచుకోగలరా అని ప్రశ్నించారు. కానీ ఒక్కరోజులో ఎన్ని కేజీల బిర్యానీ ఆర్డర్లు వచ్చారో మాత్రం చెప్పగలరని విమర్శించారు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియా యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ముంబైలో 4 వేల 300 మంది డెలివరీ భాగస్వాములకు జొమాటో ఒకేచోట ఫస్ట్ ఎయిడ్ పాఠాలు నేర్పించింది. ఇందుకు సంబంధించి కంపెనీ బాస్ సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేశారు. '30 వేల మందికి పైగా జొమాటో డెలివరీ ఏజెంట్లు ఇప్పుడు రోడ్లపై అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సహాయం అందించేందుకు వృత్తిపరమైన శిక్షణ పొందారు. ఈ ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్' అంటూ పోస్ట్ చేశారు. దీనిపైనే కునాల్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు.


Click it and Unblock the Notifications