కుప్పకూలిన Signature Bankని కొన్న మరో అమెరికా బ్యాంక్.. డీల్ పూర్తి వివరాలు
Signature Bank: అమెరికాలో బ్యాంకింగ్ విధ్వంసం కొనసాగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో మూడు బ్యాంకులు దివాలా తీశాయి. ఈ క్రమంలో చెలరేగిన ఆందోళనలను తగ్గించటానికి రెగ్యులేటరీ సంస్థలు చర్యలు చేపట్టాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కుప్పకూలిన సిగ్నేచర్ బ్యాంక్ ను.. న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ ను 2.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ డీల్ లో భాగంగా సోమవారం నుంచి సిగ్నేచర్ బ్యాంకుకు చెందిన 40 శాఖలు ఫ్లాగ్ స్టార్ బ్యాంక్ గా మారనున్నట్లు వెల్లడించారు. ఫ్లాగ్ స్టార్ బ్యాంక్ అనేది న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ సబ్సిడరీ అని ఫెడరల్ డిపాజిట్ వెల్లడించింది.

ఈ డీల్ ద్వారా సిగ్నేచర్ బ్యాంక్ కు సంబంధించిన 38.4 బిలియన్ డాలర్ల ఆస్తులను ఈ డీల్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సిగ్నేచర్ బ్యాంక్ రుణాలలో 60 బిలియన్ డాలర్ల రిసీవర్‌షిప్‌లో ఉంటాయని, వాటిని సకాలంలో విక్రయిస్తామని అధికారులు తెలిపారు. రెగ్యులేటర్లు మూసివేసే సమయానికి, సిగ్నేచర్ US చరిత్రలో మూడవ అతిపెద్ద బ్యాంక్ వైఫల్యంగా నమోదైంది.
డిసెంబర్ 31, 2022 నాటికి సిగ్నేచర్ బ్యాంక్ వద్ద మెుత్తం 88.6 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కలిగి ఉంది. అయితే బ్యాంకులు మునిగిపోవటంతో చాలా మంది డిపాజిటర్లు తమ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. డబ్బును సురక్షితంగా కస్టమర్లు తిరిగి పొందవచ్చని రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ప్రజల్లో భయాందోళనలను తగ్గించేందుకు వారు చర్యలు వేగవంతం చేశారు.


Click it and Unblock the Notifications