Crypto News: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలకు నిరంతరాయంగా క్రేజ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో క్రిప్టోలు విజృంభించటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ క్రిప్టో ఫ్లాట్ ఫారమ్ కాయిన్ స్విచ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.
వాస్తవానికి వాజ్‌రిక్స్ సైబర్ అటాక్ కారణంగా జూలై 2024లో యూజర్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కాయిన్ స్విచ్ కేర్స్ పేరుతో రికవరీ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దీని ద్వారా రూ.600 కోట్లను తిరిగి రికవర్ చేయాలనుకుంటున్న వారికి కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. తాజా చొరవ యూజర్ల నష్టాలను అంచనా వేయడానికి, CoinSwitchకి మారేందుకు అనుమతిస్తుంది. ఈ క్రమంలో WazirX నిధులను విడుదల చేసిన తర్వాత వాటిని యూజర్ల కాయిన్ స్విచ్ ఖాతాలకు బదిలీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

వాస్తవానికి గత ఏడాది జరిగిన సైబర్ ఎటాక్ కారణంగా WazirXలో ఖాతాలు కలిగి ఉన్న 40 లక్షల మంది యూజర్లు దాదాపు రూ.230 మిలియన్ డాలర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియాలో క్రిప్టో కరెన్సీలపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం క్రిప్టోలు బులిష్ జోరు కొనసాగిస్తున్నందున వినియోగదారులు తిరిగి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించటానికి ఈ చొరవ తీసుకున్నట్లు కాయిన్ స్విచ్ పేర్కొంది. రానున్న ఎనిమిది నెలల్లో నష్టపోయిన యూజర్లు ప్రస్తుత మార్కెట్లో తమ నష్టాలను 100 శాతం తిరిగి పొందటానికి అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం యూజర్లు కాయిన్ స్విచ్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చని ఫండ్స్ లేదా విజిరిక్స్ రిలీజ్ చేసే వరకు వేచి ఉంచవచ్చని వెల్లడించింది. నేటి నుంచి కాయిన్ స్విచ్ కేర్స్ పోర్టల్ సందర్శించటం ద్వారా నష్టాలను అంచనా వేయటంతో పాటు ఫండ్స్ డిపాజిట్ రివార్డ్ క్రెయిమ్ చేయవచ్చని పేర్కొంది. భారతదేశంలోని యూజర్లు ప్రస్తుత మార్కెట్ బూమ్ అవకాశాలను మిస్ కాకుండా చూసే క్రమంలో భాగంగా తాము ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సహ వ్యవస్థాపకుడు ఆషిష్ సింఘాల్ పేర్కొన్నారు. గతంలో సైబర్ అటాక్ నుంచి నష్టాలను రికవర్ చేసుకునేందుకు యూజర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు.
అటాక్ వల్ల నష్టపోయిన యూజర్లు ప్రస్తుత అవకాశాన్ని మిస్ కాకుండా చూసేందుకు తాము ప్రస్తుతం ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సింఘాల్ వెల్లడించారు. CoinSwitch Cares పోర్టల్‌లో ధృవీకరణ, అంచనా రికవరీ కోసం వినియోగదారులు వారి WazirX స్టేట్‌మెంట్‌లను అప్‌లోడ్ చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ వల్ల రానున్న 24 నెలల్లో దీనిని వినియోగించుకునే యూజర్లు డిపాజిట్ చేసిన మెుత్తంలో 10 శాతాన్ని సైనప్ రివార్డు రూపంలో తిరిగి పొందటానికి వీలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కాయిన్ స్విచ్ కేర్స్ అనేది రికవరీ ప్రోగ్రామ్ కంటే ఎక్కువ. ఇది భారతదేశంలో సురక్షితమైన, అభివృద్ధి చెందుతున్న క్రిప్టో పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిబద్ధతతో తాము ముందుకు సాగుతున్నామన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications