వాషింగ్టన్: అమెరికాకు చెందిన టాప్ క్రిప్టోకరెన్సీ లావాదేవీల కంపెనీ కాయిన్‌బేస్ (Coinbase).. భారత్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. తన కార్యాలయాన్ని నెలకొల్పబోతోంది. ఆసియా మార్కెట్‌లో అడుగు పెట్టే ప్రయత్నాల్లో ఉంటోన్న కాయిన్‌బేస్ కంపెనీ యాజమాన్యం త్వరలోనే భారత్‌ను తన కేంద్రబిందువుగా చేసుకోనుంది. భారత్ ప్రధాన కేంద్రంగా ఆసియా మార్కెట్‌లో తన లావాదేవీలను విస్తరింపజేసుకోనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కాయిన్‌బేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్వయంగా ప్రకటించారు.
కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంటర్నేషనల్.. అమెరికన్ కంపెనీ. డెలావర్‌లోని విల్మింగ్టన్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడం, విక్రయించడం దీని ప్రధాన కార్యకలాపాలు. 2012లో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఫ్రెడ్ దీన్ని నెలకొల్పారు. క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్, ఎథేరియం, బిట్‌కాయిన్ క్యాష్, లైట్‌కాయిన్‌లను కొనుగోలు చేయడం.. విక్రయించడం ద్వారా వచ్చే కమీషన్ ద్వారా ఈ కంపెనీ పెద్ద ఎత్తున కార్యకలాపాలను సాగిస్తోంది.

బారత్‌లో తొలిసారిగా అడుగు పెట్టబోతోన్న ఈ క్రిప్టోకరెన్సీ కంపెనీకి మంచి స్పందనే లభించేలా కనిపిస్తోంది. తాము భారత్‌లో కార్యాలయాన్ని నెలకొల్పబోతోన్నామంటూ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ చేసిన ట్వీట్, బ్లాగ్ పట్ల భారతీయులు అనూహ్యంగా స్పందించారు. వెయ్యికి పైగా రీట్వీట్లు నమోదయ్యాయి. అయిదువేల మందికి పైగా లైక్ చేశారు. 350 మందికి పైగా కామెంట్స్ చేశారు. వెల్‌కమ్ ఇండియా అంటూ స్వాగతం పలికారు. కాయిన్‌బేస్ కార్యకలాపాలు ఎగ్జయింటింగ్‌గా అనిపిస్తాయని నెటిజన్లు వ్యాఖ్యానించారు.
ఈ కంపెనీ భారత్‌లో ప్రవేశించడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉంది. ఫైనాన్స్ సెక్టార్‌పై మంచి పట్టు, అవగాహన ఉన్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ఉద్యోగం సాధించాలంటే- క్రిప్టోకరెన్సీ లావాదేవీల మీద మంచి ఉండాల్సి ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్, ప్లాట్‌ఫామ్ పేమెంట్స్, క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్, డేటా ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్, గ్రోత్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ వంటి సెక్టార్లలో నిష్ణాతులై ఉండాలి.


Click it and Unblock the Notifications