Google AI News: లేటుగా వచ్చి లైట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న గూగుల్ AI.. మరో దిగ్గజ కంపెనీతో డీల్..
Cognizant News: మైక్రోసాఫ్ట్ మద్ధతుతో లాంచ్ అయిన 'చాట్ జీపీటీ' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సంచలనంగా మారింది. ప్రత్యర్థికి పోటీగా వేగంగా AI టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని టెక్ దిగ్గజం గూగుల్ భావించింది. అనుకున్నదే తడవుగా జెమినీ పేరిట తన AI మోడల్‌ను పరిచయం చేసింది. మొదట్లో కొంత తడబడినా, ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు వడివడిగా అడుగులు వస్తోంది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో సహాయం కోసం ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఆర్టిఫిషియల్ టెక్నాలజీని వినియోగించాలని ప్రముఖ IT సంస్థ కాగ్నిజెంట్ నిర్ణయించింది. ఇందుకోసం గూగుల్ మోడల్ జెమినీ ఉత్పాదక AIని స్వీకరిస్తోంది. కంపెనీ అంతర్గత కార్యకలాపాలు మరియు ప్లాట్‌ఫారమ్‌లలో జెమినీ అధునాతన సామర్థ్యాలను ఏకీకృతం చేయనున్నట్లు తెలుస్తోంది.

'గూగుల్ క్లౌడ్ కోసం జెమినీని ఉపయోగించనున్నాం. తద్వారా కాగ్నిజెంట్ డెవలపర్‌లు AI-పవర్డ్ టూల్స్ సహాయంతో కోడ్‌ను వేగంగా మరియు మరింత ప్రభావవంతంగా రాయగలరు. కోడ్ టెస్టింగ్ మరియు డెప్లాయ్‌మెంట్ అమలు సులభతరం అవుతుంది. క్లయింట్ అప్లికేషన్‌ల రూపకల్పన, నిర్వహణల్లో విశ్వసనీయత మరియు వ్యయ సామర్థ్యాన్ని మెరుగుపరచవ్చు' అని కాగ్నిజెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.
రాబోయే ఏడాదిలో గూగుల్ క్లౌడ్ AIకు చెందిన పలు విభాగాల్లో 70 వేల మంది ఉద్యోగులను ఎనేబుల్ చేయనున్నట్లు కాగ్నిజెంట్ వెల్లడించింది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ ఉద్యోగులకు కావాల్సిన నైపుణ్యాలను అందించే లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లు AI సొల్యూషన్‌లను ఆర్కిటెక్ట్ మరియు స్కేల్ చేయడానికి సహాయంగా బెంగళూరు, లండన్ మరియు టెక్సాస్ క్యాంపస్‌లలోని క్లౌడ్ AI ఇన్నోవేషన్ హబ్స్‌లో జెమినీ స్టూడియోను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.


Click it and Unblock the Notifications