ఏపీని అభివృద్ధి పథంలో నడిపే దిశలో కూటమి సర్కారు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంను ఐటీ హబ్ చేయడంలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది. గ్లోబల్ వైడ్ గా ఐటీ రంగంలో దూసుకుపోతున్న కాగ్నిజెంట్ విశాఖలో తన క్యాంపస్ ప్రారంభించబోతోంది. ఈ మేరకు అధికారికంగా కంపెనీ వెల్లడించినట్లు తెలుస్తోంది. విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటయితే పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
రూ.1,582 కోట్ల పెట్టుబడితో విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తో కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. ఈ సంస్థ విశాఖలో ఏర్పాటుతో దాదాపు 8000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ కంపెనీకి ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెట్టుబడి ద్వారా 8 ఏళ్లలో 8000 ఉద్యోగాలను వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) కింద కాపుల ఉప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమిని కావాలని కాగ్నిజెంట్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా ప్రభుత్వం దీనికి సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో కాగ్నిజెంట్ ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.1,582 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ క్యాంపస్‌ను నిర్మించి, కార్యకలాపాలు సాగించడానికి సిద్ధంగా ఉన్నామని కాగ్నిజెంట్ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు.2029 మార్చి నాటికి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి కాగ్నిజెంట్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కాగా కొన్ని నెలల కిందట దావోస్ పర్యటన సమయంలో మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ భేటీ అయి విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరిన సంగతి విదితమే.
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు ద్వాారా ఏపీని ఐటీ హబ్‌గా మార్చాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద విజయంగా భావిస్తున్నారు.అయితే ఇదే సమయంలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల కిందట ఇదే విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూములను రూపాయికే ఏపీ సర్కార్ కేటాయించటం సర్వత్రా చర్చకు దారితీసింది. విశాఖలో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో టీసీఎస్ రూ. 1,370 కోట్లు పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 12 వేల నుంచి 15వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. తాజాగా ఇప్పుడు మరో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కి కూడా రూపాయికే ఎకరం భూమి ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.


Click it and Unblock the Notifications