Cognizant News: MNC కంపెనీ కొనుగోలు చేసిన కాగ్నిజెంట్.. టర్నోవర్ చూస్తే మతిపోవాల్సిందే..
Cognizant Belcan deal: ఈమధ్య టెక్ కంపెనీలు ఇతర సంస్థలను కొనుగోలు చేయడంలో బిజీగా గడుపుతున్నాయి. ఒక పక్కన ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్స్ ఇచ్చి ఉద్యోగులను తొలగిస్తూనే.. మరో పక్కన భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ IT దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఇదే పని చేసింది. భారీ మొత్తాన్ని వెచ్చించి ఓ కంపెనీని సొంతం చేసుకుంది.
ప్రముఖ గ్లోబల్ ఇంజనీరింగ్ కంపెనీ 'బెల్‌కాన్'ను కొనుగోలు చేస్తున్నట్లు IT దిగ్గజం కాగ్నిజెంట్ ప్రకటించింది. అమెరికాలోని ఓహియో కేంద్రంగా ఈ కంపెనీ పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో తమ పరిధిని మరింత విస్తరిస్తున్నట్లు పేర్కొంది. IoT మరియు డిజిటల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్‌ల అప్‌గ్రేడ్‌కు ఈ డీల్ మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పింది.

దాదాపు 1.3 బిలియన డాలర్లను వెచ్చించి బెల్ కాన్‌ను కాగ్నిజెంట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందంలో భాగంగా సదరు కంపెనీ CEOనే ఆ సంస్థకు సారథిగా వ్యవహరిస్తారని సమాచారం. కంపెనీ దాదాపు 60 దేశాల్లో సేవలందిస్తుండగా.. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థ వార్షిక ఆదాయం 66 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
పలు అంతర్జాతీయ కంపెనీలు బెల్ కాన్ కు క్లయింట్స్ కావడం గమనార్హం. వాటిలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తో పాటు రోల్స్ రాయిస్, బ్లోయింగ్ వంటి ఆటోమొబైల్ మరియు ఏవియేషన్ ఇండస్ట్రీలకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవేకాక జనరల్ మోటార్స్, అమెరికా నేవీ వంటి సంస్థలకు కూడా బెల్ కాన్ సేవలందిస్తోంది.


Click it and Unblock the Notifications