IT News: సరైన టైంలో కాగ్నిజెంట్ కంపెనీ ఎదురుదెబ్బ.. ఇది అస్సలు ఊహించనిదే..
Cognizant News: గత కొంత కాలంలో దేశీయ ఐటీ రంగంలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ గురించి వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి అనేక ప్రముఖ టాప్ టెక్ కంపెనీల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగులు తమ రాజీనామా తర్వాత కాగ్నిజెంట్ లో చేరటం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాగ్నిజెంట్ ఇండియా సీఈవో రాజేష్ నంబియార్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. గత నాలుగేళ్లుగా కాగ్నిజెంట్ ఇండియా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన రాజీనామా చేయటం చాలా మందిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసిందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో హెచ్‌సీఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజేష్ నంబియార్ రాజీనామా స్థానాన్ని రాజేష్ వారియర్ అక్టోబర్ 1 నుంచి భర్తీ చేయనున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా ప్రకటించింది. ఆయన కాగ్నిజెంట్ గ్లోబల్ ప్రాసెస్ హెడ్‌గా కూడా వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో చేరడానికి ముందర వారియర్ ఇన్ఫోసిస్ అమెరికాకు హెడ్‌గా పనిచేశారు.

కాగ్నిజెంట్ నుంచి వైదొలిగిన రాజేష్ నంబియార్ త్వరలో ఐటీ ఉద్యోగుల అత్యున్నత సంస్థ నాస్కామ్ అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. NASSCOM అనేది 1988లో స్థాపించబడిన సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీల జాతీయ సంఘం. భారతదేశంలో ఐటీ, వ్యాపార ప్రక్రియ రంగాల అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. దేపజానీ ఘోష్ పదవీ విరమణ చేసిన తర్వాత ఇప్పుడు రాజేష్ నంబియార్ నాస్కామ్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆయన 50 బిలియన్ డాలర్ల నాస్కామ్‌కు సారథ్యం వహించనున్నారు. ప్రస్తుతం దాని సభ్యుడిగా ఉన్న నంబియార్ త్వరలో దాని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
వాస్తవానికి రాజేష్ నంబియార్ 2020లో కాగ్నిజెంట్ ఇండియాలో చేరారు. ఆ తర్వాత ఆయనకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు ఆయన జియోన్ ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు. అంతకు ముందు ఆయన ప్రఖ్యాత అమెరికన్ టెక్ సంస్థ ఐబీఎమ్ కంపెనీలో అప్లికేషన్స్ సర్వీసెస్ విభాగంలో పనిచేశారు.


Click it and Unblock the Notifications