Cognizant: ప్రస్తుతం ఐటీ కంపెనీలు నియమకాలను చాలా వరకు తగ్గించాయి. దీనికి వ్యాపారాల మందగమనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక అస్థిరతలు కూడా కారణంగా నిలుస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలో ఉద్యోగాలను వీడుతున్న టెక్కీల సంఖ్య భారీగానే పెరుగుతోంది. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం అందిస్తున్న కంపెనీలనే వారు ఎక్కువగా ఎంచుకోవటం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే చాలా టెక్ కంపెనీలు ప్రస్తుతం వారి దృష్టి ఫ్రెషర్లపై పెట్టాయి. భవిష్యత్తు కంపెనీ అవసరాల కోసం వారిని ముందుగానే నియమించుకుంటున్నాయి.

హైదరాబాద్ లో ఉద్యోగం..
అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిజెంట్ నియామకాల్లో వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో 193వ స్థానంలో ఉన్న కంపెనీ భారత్ లో తన వ్యాపార కార్యకలాపాల వేగం పెంచింది. హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగాల నియామకానికి కంపెనీ ప్రకటన చేసింది.

ఉద్యోగ అర్హతల వివరాలు..
* జాబ్ రోల్ - DevOps ఇంజనీర్
* అర్హత - B.E./B.Tech
* జాబ్ లొకేషన్ - హైదరాబాద్
* ప్యాకేజీ - ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
* అనుభవం - 0- 1 సంవత్సరం
* కావలసిన స్కిల్ - Java

ఈ స్కిల్స్ ఉండే మంచిది..
* AWS Cloud
* React JS
* Openshift
* Spring Boot
* AWS
* Javascript
* Oracle

ఎందుకు డిమాండ్..
డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్‌ల మధ్య వైరుధ్యాలను తొలగించడం ద్వారా DevOps సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంపెనీల్లో విస్తరణలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. DevOps కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచటంతో పాటు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందించటంలో తోడ్పడుతుంది. కంపెనీల వ్యాపారాల విస్తరణకు ఇది ఎంతగానో సహాయపడుతోందని ఐటీ కంపెనీలు అంటున్నాయి. indeed.com ప్రకారం DevOps ఉద్యోగాల నియామకాల్లో డిమాండ్ 75% పెరుగుదల ఉంది. అదే లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా సైట్‌లు DevOpsని నైపుణ్యంగా పేర్కొనడంలో 50% పెరుగుద ఉంది.

కెరీర్ పాత్.. భారీ జీతం..
DevOpsలో కెరీర్ పాత్ మీరు రిలీజ్ మేనేజర్‌గా ప్రారంభించవచ్చు. DevOps టెస్ట్ ఇంజనీర్, DevOps క్లౌడ్ ఇంజనీర్, చివరకు DevOps ఆర్కిటెక్ట్‌గా మారవచ్చు. Glassdoor సమాచారం ప్రకారం దేశంలో ఈ స్కిల్ ఉన్నవారికి సగటు వార్షిక శాలరీ ప్యాకేజ్ రూ.6.50 లక్షలు ఉంది. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోని కెరీర్స్ విభాగంలో సంప్రదించండి.


Click it and Unblock the Notifications