Cognizant: అమ్మకానికి కాగ్నిజెంట్ మెయిన్ ఆఫీస్..!
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తన ఆస్తులను అమ్మకానికి పెట్టింది. తన ప్రైమ్ ప్రాపర్టీలలో ఒక దానిని విక్రయించడానికి సిద్ధమైంది. ఈ విక్రయం ద్వారా కంపెనీకి కనీసం రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా దాని భారత ప్రధాన కార్యాలయంగా పనిచేసిన కాగ్నిజెంట్ ఆఫీస్ ను అమ్మనున్నారు. చెన్నైలోని ఐటీ కారిడార్‌లో 15 ఎకరాల ల్యాండ్ పార్శిల్, 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉంది.
ఈ ఆస్తినే అమ్మకానికి పెట్టింది. OMRలో ఓక్కియం తోరైపాక్కంలో ఉన్న ప్రైమ్ ప్రాపర్టీని విక్రయించడానికి అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజర్స్ JLLని చేర్చుకున్నట్లు తెలిసింది. 20 సంవత్సరాలకు పైగా దాని ప్రధాన కార్యాలయంగా ఉన్న OMR కార్యాలయం సహ వ్యవస్థాపకులు లక్ష్మీ నారాయణన్, చంద్రశేఖరన్‌లు ఇక్కడ నుంచి పనిచేస్తున్నారు. సంస్థ ఇప్పటికే స్థానిక డెవలపర్లు, భాష్యం గ్రూప్, కాసాగ్రాండ్‌తో సహా అనేక మంది కొనుగోలుదారులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది.

క్యాంపస్‌ను ఖాళీ చేసే ప్రక్రియ డిసెంబర్ 2024 నాటికి ముగియవచ్చు. ఆ తర్వాత కాగ్నిజెంట్ తన భారత ప్రధాన కార్యాలయాన్ని GST రోడ్డులోని తాంబరం సమీపంలోని MEPZ క్యాంపస్‌కు తరలించాలని భావిస్తున్నారు. టెక్ మేజర్ తన కార్యకలాపాలను MEPZ, షోలింగనల్లూర్, సిరుసేరిలోని మూడు స్వంత భవనాలలో నిర్వహించనున్నారు. చెన్నై అంతటా లీజుకు తీసుకున్న స్థలాలను వదులుకోవడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది ఖాళీ కొన్ని లీజు స్థలాలలో రామానుజన్ IT పార్క్, DLF, RA పురంలోని సెయింట్ మేరీస్ రోడ్ కార్యాలయాలు ఉన్నాయి. కంపెనీ విక్రయించబోయే క్యాపం నుంచి కాగ్నిజెంట్ రిమోట్‌గా నాస్‌డాక్ ఓపెనింగ్ బెల్ మోగించే ల్యాండ్‌మార్క్ ఈవెంట్ జరిగింది.


Click it and Unblock the Notifications