IT News: కాగ్నిజెంట్ అంతు చూస్తామంటున్న ఇన్ఫోసిస్.. మ్యాటర్ సీరియస్..
Infosys Vs Cognizant: భారత ఐటీ కంపెనీల మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా వ్యాపారపరంగా ఉన్న పోటీ కాస్త వ్యక్తిగత స్థాయిలకు చేరుకున్న కనిపిస్తోంది. ఈ క్రమంలో వ్యవహారం అంతర్జాతీయ న్యాయస్థానాలకు చేరుకోవటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ ఇన్ఫోసిస్ ఆగస్టు 23న ప్రత్యర్థి కాగ్నిజెంట్ అనుబంధ సంస్థ కాగ్నిజెంట్ ట్రైజెట్టో టెక్సాస్ ఫెడరల్ కోర్టులో తన ఆరోగ్య సంరక్షణ బీమా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది. ఈ క్రమంలో దావాలో పేర్కొన్న అన్ని ఆరోపణలను తాము తిరస్కరిస్తున్నామంటూ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ప్రకటించింది.

కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్‌లో ట్రైజెట్టోస్ ఫేసెస్, క్యూఎన్‌ఎక్స్‌టి ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపయోగించాయి. అయితే ఇన్ఫోసిస్ ట్రైజెట్టో సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి "ఫేసెస్‌ల కోసం టెస్ట్ కేస్‌లను" రూపొందించిందని కాగ్నిజెంట్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇది ట్రైజెట్టో డేటాను ఇన్ఫోసిస్ ఉత్పత్తికి సరిగ్గా రీప్యాక్ చేసింది. సలీల్ పరేఖ్ కంపెనీ ఇన్ఫోసిస్ క్యూఎన్‌ఎక్స్‌టి నుంచి గోప్యమైన ట్రైజెట్టో సమాచారం, వాణిజ్య రహస్యాలను సేకరించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ తెలిపింది. ఈ క్రమంలో కాగ్నిజెంట్ నష్ట పరిహారంతో పాటు, తన వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్ దుర్వినియోగం చేయడాన్ని నిలిపివేయాలని కోర్టును కోరింది.
వాస్తవానికి గత ఏడాది చివర్లో భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ కంపెనీలో ముఖ్య అధికారిక పాత్రల్లో ఉన్న ఉద్యోగులను చేర్చుకోవటంపై యూఎస్ టెక్ మేజర్ కాగ్నిజెంట్ కు నిరసనను తెలియజేసేందుకు లేఖ పంపిన తర్వాత రెండు సంస్థల మధ్య పోటీ తారా స్థాయిలకు చేరుకుంది. జనవరి 2023లో కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దాదాపు 20 మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌లను, నలుగురు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లను నియమించుకున్నారు. వీరిలో చాలా మంది విప్రో, ఇన్ఫోసిస్‌లకు చెందినవారు కావటం గమనార్హం. అలాగే రవి ఇన్ఫోసిస్ కంపెనీలో దాదాపు 9 ఏళ్ల పాటు పనిచేశారు.


Click it and Unblock the Notifications