Cognizant Salary Hikes: తాజాగా అమెరికా కేంద్రంగా ఇండియాలో పనిచేస్తున్న ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాదులో తన క్యాంపస్ విస్తరణ పనులు ప్రారంభించటంతో వార్తలు నిలిచింది. అయితే దీని తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక వార్త అనేక మంది ఉద్యోగుల ఆందోళలను వెలుగులోకి తీసుకొచ్చింది.
కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకు కేవలం 1% వార్షిక వేతన పెంపును అందించడం టెక్ రంగంలో పెద్ద దుమారానికి తెరలేపింది. కంపెనీ జీతాల పెంపులో ఇప్పటికే నాలుగు నెలల ఆలస్యం చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అందరి ఊహలకు భిన్నంగా కేవలం 1% వేతన పెంపు ప్రకటించటంపై కాగ్నిజెంట్ టెక్కీలు దుఃఖంలో మునిగిపోయారు. ఇదే క్రమంలో కంపెనీ ఉద్యోగులకు గరిష్ఠంగా 5% వేతన పెంపును మాత్రమే ఇచ్చిందని వెల్లడైంది.

దీనికి ముందు కాగ్నిజెంట్ గడచిన ఏడాది ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు వేతనాల పెంపును అందించింది. ఐటీ సేవల ఎగుమతులు మందగించటం, డిమాండ్ తగ్గటం వల్ల ప్రాజెక్టులు లేకపోవటంతో జీతాల పెంపును ఆలస్యం చేయాలని నిర్ణయాన్ని కంపెనీ అప్పట్లో తీసుకుంది. ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండడం, ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో వినియోగదారులు ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యయాన్ని నియంత్రించుకుంటున్నారు. ఆ ప్రభావం ప్రస్తుత సైకిల్ వేతన పెంపుల్లో కనిపించింది.
కాగ్నిజెంట్ ఉద్యోగుల ప్రకారం 3 స్టార్ రేటింగ్ ఉన్నవారికి 1 నుంచి 3% పెంపు, 4 స్టార్ రేటింగ్ ఉన్న ఉద్యోగులకు 4 శాతం పెంపు, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఉద్యోగులకు గరిష్ఠంగా 4.5 శాతం నుంచి 5 శాతం వేతన పెంపును కంపెనీ ఈసారి అందించింది. అయితే గత ఏడాది హైక్ సైకిల్ సమయంలో ఉద్యోగులకు దాదాపు 7 శాతం నుంచి 11 శాతం వరకు వేతన పెంపులను అందించింది. దీనికి తోడు ఐటీ సంస్థ నిన్న ప్రెషర్స్ కు అత్యల్పంగా రూ.2.52 లక్షల వార్షిక శాలరీ ప్యాకేజీతో ఉద్యోగాలను ఆఫర్ చేయటం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 70 శాతం మంది భారతీయులే. జూన్ త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,100 తగ్గి 3,36,300కి చేరుకుంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications