AI ఉద్యోగాలు సృష్టిస్తుందా, తగ్గిస్తుందా ? టెక్ లీడర్ల మధ్య భిన్న అభిప్రాయాలు..
ప్రస్తుతం AI ప్రపంచ టెక్ రంగాన్ని వేగంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో AI ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై టెక్ లీడర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా కాగ్నిజెంట్ CEO రవి కుమార్ ఒక ఆశావాద దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నారు. AI ఇంజనీర్ల ఉద్యోగావకాశాలను తొలగించదని, దీనికి బదులుగా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన నమ్ముతున్నారు. AI టూల్స్ జూనియర్ డెవలపర్‌లను నిరుపయోగం కాకూండా వారిని మరింత శక్తివంతం చేస్తాయని కుమార్ పేర్కొన్నారు. కాగ్నిజెంట్ ఇంటెర్నల్ డేటా ప్రకారం, AI సహాయంతో తక్కువ అనుభవం ఉన్న డెవలపర్‌ల ప్రొడక్షన్ 37% పెరిగింది, ఇది అనుభవజ్ఞులైన కోడర్‌ల పర్ఫార్మెన్స్ కూడా అధిగమిస్తోంది. AI పనులను సులభతరం చేసి స్కిల్స్ ప్రయోజనాన్ని తగ్గించి, అందరికీ సమాన అవకాశాలను అందిస్తుందని రవి కుమార్ వాదిస్తున్నారు. AI ఉద్యోగాల తొలగింపునకు కారణం కాకుండా, కొత్త గ్రాడ్యుయేట్‌లను త్వరగా కంపెనీలలో చేర్చుకోవడానికి వీలు కల్పించే ఒక "నిచ్చెన"గా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు అండ్ CEO డారియో అమోడీ మాత్రం వేరే విధంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్‌లో పెద్దగా తొలగింపులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. AI వేగంగా అభివృద్ధి చెందుతున్నందున టెక్నాలజీ, ఫైనాన్స్, లీగల్ ఇంకా కన్సల్టింగ్ రంగాలలో ఉద్యోగ నష్టాలను ఆశించవచ్చని అమోడీ పేర్కొన్నారు. భవిష్యత్తులో నిరుద్యోగిత రేట్లు 20% వరకు పెరిగే అవకాశం ఉందని, మానవ కార్మికులను భర్తీ చేయడానికి వ్యాపారాలు AI వైపు మొగ్గు చూపుతాయని ఆయన అన్నారు.
Nvidia CEO జెన్సెన్ హువాంగ్ మధ్యేమార్గంగా AI ఉద్యోగాలను మారుస్తుందని, కానీ భారీ నిరుద్యోగానికి దారితీయదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి, అమోడీ దృక్పథం వాస్తవరూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. సేల్స్‌ఫోర్స్, మెటా వంటి అనేక టెక్ సంస్థలు నియామకాలను తగ్గించాయి. మైక్రోసాఫ్ట్ AI దాని కోడ్‌లో 20-30% రాస్తుందని వెల్లడించగా, గూగుల్ AI వ్యవస్థలు కొత్త కోడ్ జనరేషన్‌లో 30% పైగా దోహదపడుతున్నాయి. మే 2025 నాటికి Layoffs.fyi డేటా ప్రకారం 130 కంపెనీలలో 61,220 మందికి పైగా టెక్ ఉద్యోగులను తొలగించారు.
AIని ఎలా అన్వయిస్తున్నారనే దానిపైనే ఈ వ్యత్యాసం ఆధారపడి ఉంది. కానీ కాగ్నిజెంట్‌లో AI హ్యూమన్ స్కిల్స్ పెంచుతుండగా, ఇతర కంపెనీలలో ఇది మ్యాన్ పవర్ పనులని భర్తీ చేస్తోంది. ఉత్పాదకత నిర్వచనం మారినప్పుడు, అర్థవంతమైన పని నిర్వచనం కూడా మారుతుంది.


Click it and Unblock the Notifications