IT News: చాలా కాలంగా దేశీయ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులతో పాటు బోనస్ ప్రకటన గురించి కీలక సమాచారాన్ని అధికారికంగా పంచుకుంటున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులకు వీటికి సంబంధించిన వివరాలను షేర్ చేశాయి. ఈ క్రమంలోనే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులకు వీటికి సంబంధించిన విషయాలపై కీలక సమాచారం అందించిందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. టెక్ మేజర్ కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో సంస్థ ఉద్యోగులకు బోనస్, ఆలస్యం అయిన జీతాల పెంపుల పత్రాల గురించి ఉద్యోగులతో మాట్లాడారు. వాస్తవానికి ఇది ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరించడానికి, సంస్థ పరిహారం ప్రణాళికలపై స్పష్టత ఇవ్వడానికి ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ సమావేశంలో సీఈవో ఉద్యోగుల ఆందోళనలను అంగీకరించారు. ముఖ్యంగా వేతన పెంపులపై మాట్లాడుతూ.. వాస్తవానికి వీటిన ఏప్రిల్‌లో జరగాలని నిర్ణయించబడినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలస్యానికి కారణాన్ని వివరిస్తూ.. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులతో సరిగ్గా సరిపోలడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. అయితే సంస్థ హామీ ఇచ్చిన పెంపులను గౌరవించడంలో నిబద్ధత ఉందని, అయితే ఇది కొంత మేరకు ఆలస్యంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో సీఈవో రవి కుమార్ బోనస్ నిర్మాణంపై కూడా కీలక కామెంట్స్ చేశారు. కంపెనీ అర్హత గల ఉద్యోగులు తమ బోనస్లను ప్రణాళిక ప్రకారం అందుకుంటారని తెలిపారు. సమయానికిగాను చెల్లింపులు జరిపేందుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మా ఉద్యోగులు వారి కష్టపడి పని చేసినదానికి తగినంత న్యాయం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ ఈ మార్చి నెలలో బోనస్లు అందజేయనున్నది. ఈ బోనస్ లు పొందడానికి అర్హులైన ఉద్యోగులు మార్చి 10 నాటికి బోనస్ లెటర్స్ మెయిల్ ద్వారా పొందుతారని స్పష్టం చేశారు. ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీ వృద్ధి, ఆవిష్కరణల పై దృష్టిని తప్పించటం లేదని వెల్లడించారు.
కంపెనీ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తు విజయాలను సాధించటానికి ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టడంపై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఉద్యోగులకు వేతన పెంపులు మరింత ఆలస్యాన్ని సూచిస్తున్నాయి. ఇది ఉద్యోగుల మోటివేషన్ దెబ్బతీస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications