Coffee Day: ఒక్కరోజే 20 శాతం పెరిగిన కేఫ్ కాఫీడే స్టాక్స్.. ఎందుకంటే..

Coffee Day Share: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కాఫీడే షేర్లు మార్కెట్లో భారీగా లాభపడ్డాయి. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో కుప్పకూలిన తర్వాత షేర్లలో కొనుగోళ్ల హడావిడి మెుదలైంది.

దీంతో ట్రేడింగ్ సమయంలో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ ధర 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో షేర్ ధర రూ.51.36 చేరుకుంది. కంపెనీ సబ్సిడరీ కాఫీడే గ్లోబల్ కార్పొరేట్ దివాలాకు నేషనల్ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ తీర్పు చెప్పటంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. గతంలో ఇచ్చిన NCLT తీర్పుపై స్టే ఇస్తున్నట్లు NCLAT ఆగస్టు 11న తీర్పు వెలువరించిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Coffee Day stocks up 20 percent as NCLAT puts stay over Indusind bank petetion

ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కార్పొరేట్ దివాలా కోసం కాఫీ డే గ్లోబల్ ఒప్పుకోలేదు. పాజిటివ్ వార్తల నేపథ్యంలో మార్కెట్లో నేడు 24.01 లక్షల కాఫీడే ఎంటర్ ప్రైజెస్ షేర్లు బీఎస్ఈలో చేతులు మారాయి. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,085 కోట్లుగా నమోదైంది.

ఇదే క్రమంలో కాఫీడే కంపెనీ షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్ వర్క్ కింద ఉంచాయి. షేర్ల ధరల్లో అధిక అస్థిరత గురించి పెట్టుబడిదారులను హెచ్చరించడానికి ఎక్స్ఛేంజీలు షేర్లను స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ASM ఫ్రేమ్‌వర్క్‌లలో ఉంచుతుంటాయి. ప్రస్తుతం కంపెనీ కాఫీ గింజల వ్యాపారంలో నిమగ్నమై ఉంది. అలాగే ఒక రిసార్ట్‌ను కూడా కలిగి ఉంది. కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది. కాఫీ గింజలను సేకరించటం, ప్రాసెసింగ్ చేయటం, కాల్చటంతో పాటు దేశీయ, విదేశీ వినియోగదారులకు కాఫీనీ రిటైల్ గా విక్రయించే వ్యాపారాన్ని చేస్తోంది.

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ కాఫీ గింజల వ్యాపారంలో నిమగ్నమై ఉంది. కంపెనీ ఒక రిసార్ట్‌ను కలిగి ఉంది మరియు నిర్వహిస్తుంది మరియు కన్సల్టెన్సీ సేవలను అందిస్తుంది. ఇది కాఫీ గింజలను సేకరించడం, ప్రాసెస్ చేయడం మరియు కాల్చడం నుండి దేశీయ మరియు విదేశీ వినియోగదారులకు కాఫీని రిటైల్ చేయడం వరకు కాఫీ వ్యాపారంలో కూడా నిమగ్నమై ఉంది. అలాగే కంపెనీకి కాఫీ డే గ్లోబల్, టాంగ్లిన్ రిటైల్ రియాలిటీ డెవలప్‌మెంట్స్, టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్, గిరి విద్యుత్ (ఇండియా), కాఫీ డే హోటల్స్ & రిసార్ట్స్, కాఫీ డే ట్రేడింగ్, కాఫీ డే ఎకాన్ వంటి ఏడు అనుబంధ సంస్థలు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+