Coca-Cola: కోకాకోలా ఉత్పత్తులు మనం రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏ చిన్న పార్టీ చేసుకోవాలన్నా లేకపోతే ఎండలో చల్లగా సేదతీరాలన్నా కూల్ డ్రింక్ కావాల్సిందే. అయితే కంపెనీ దీపావళి సందర్భంగా వినూత్న ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇది యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

లిమిటెడ్ ఎడిషన్..
కోకాకోలా ఇండియా ఒక వినూత్న లిమిటెడ్ ఎడిషన్ "లాక్డ్" బాటిల్‌ను పండుగ సీజన్ స్పెషల్‌గా విడుదల చేసింది. లాక్ చేయబడిన బాటిల్ ప్రత్యేక బ్లూటూత్-ఎనేబుల్డ్ క్యాప్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది కేవలం పంపినవారి మొబైల్ ఫోన్ ద్వారా మాత్రమే తెరవటం కుదురుతుంది.

బాటిల్ ఆర్డర్ చేయటం ఎలా..?
ఈ బాటిళ్లను ఎవరైన తన ప్రియమైనవారి కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి. ఇందు కోసం వారి అడ్రెస్, పండుగ శుభాకాంక్షలు లేదా సందేశాన్ని నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ దీనిని మీ ప్రియమైన వారికి బహుమతి రూపంలో డెలివరీ చేయబడుతుంది. దీనిని ఆర్డర్ చేసినవారు డెలివరీ తీసుకున్న వారిని కలిసినప్పుడు మాత్రమే బాటిల్‌ను అన్‌లాక్ చేయటం కుదురుతుంది.
కరోనా తర్వాత..
గడచిన రెండు సంవత్సరాలు దేశంలోని ప్రజలు కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. వారు ఎంతగానో ప్రేమించే వారిని నేరుగా కలవలేకపోయారు. అయితే ఈ సారి అందరూ కలిసి దీపావళి చేసుకోవటాన్ని ప్రోత్సహించేందుకు కోకాకోలా #MilkeHiManegiDiwali పేరుతో సరికొత్త ప్రచారాన్ని మెుదలు పెట్టింది. ప్రజలు వ్యక్తిగతంగా కలిసి మహమ్మారి తర్వాత దీపావళిని జరుపుకోవటాన్ని ప్రోత్సహించటం దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.

ప్రచారహోరు..
కంపెనీ తన ప్రచార వీడియో కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను వినియోగిస్తోంది. డిజిటల్ ఎనేబుల్మెంట్, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ కోకాకోలా వృద్ధికి కీలక స్తంభాలని మార్కెటింగ్ డైరెక్టర్ కౌశిక్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం పండుగ సందర్బంగా కొత్త 'లాక్డ్' బాటిల్ వ్యూహం ఇందులో భాగమేనని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications