Coca-Cola IPO: భారీ ఐపీఓకు ప్లాన్ చేస్తున్న కోకా-కోలా..!
భారత్ కోకా-కోలా బ్రాండ్ చాలే ఫేమస్. థమ్సప్, స్ప్రైట్, కిన్లీ వాటర్ కూడా కోకా-కోలా బ్రాండే. అయితే కంపెనీ తన భారతీయ బాట్లింగ్ యూనిట్, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ ను ఐపీఓగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. పబ్లిక్ ఆఫర్ కోసం పెట్టుబడి బ్యాంకులను ఎంచుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ ఐపీఓతో దాదాపు 1 బిలియన్ డాలర్ల అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.9,500 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఐపీఓపై ప్రెజెంటేషన్‌లు వచ్చే వారం లండన్‌లో జరుగుతాయని తెలుస్తోంది. ఇక్కడ లావాదేవీకి సంబంధించిన కంపెనీ సలహాదారు రోత్‌స్‌చైల్డ్ & కో బ్యాంకులతో చర్చించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో లిస్టయిన పెప్సికో బాట్లింగ్ కంపెనీ చెందిన వరుణ్ బెవరేజెస్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంది. ఈ కంపెనీ పెప్సి, మిరిండా, 7అప్, మౌంటైన్ డ్యూ, స్టింగ్, స్లైస్, ఆక్వాఫినా వంటి ప్రసిద్ధ పానీయాలను తయారు చేసి పంపిణీ చేస్తుంది. కోకా-కోలా, పెప్సికో కు పోటీగా రిలయన్స్ కాంపా కోలా బ్రాండ్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ సంస్థ 2022లో కాంపా కోలా సొంతం చేసుకుంది.

ప్రస్తుతం కంపా కోలా మార్కెటింగ్ కూడా బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవలి కాలంలో అంతర్జాతీయ సంస్థలు ఇండియాలోని తమ కంపెనీలను ఐపీఓగా తీసుకొస్తున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స ఇంక్ తన భారతీయ అనుబంధ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓను గత సంవత్సరం తీసుకొచ్చింది. హ్యుందాయ్ మోటర్ కో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓగా తీసుకొచ్చి 3.3 బిలియన్ డాలర్లను సేకరించింది. కాగా హిందుస్థాన్ కోకా-కోలా పానీయాలు భారతదేశంలోని అతిపెద్ద శీతల పానీయాల బాటిల్‌లలో ఒకటిగా ఉంది.
బెంగళూరు కేంద్రంగా ఉన్న కంపెనీ 1.7 మిలియన్లకు పైగా రిటైల్ అవుట్‌లెట్‌లకు సేవలు అందిస్తుంది. ఈ కంపెనీలో 5,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సంస్థకు 12 రాష్ట్రాలలో 14 తయారీ ప్లాంట్‌లను నిర్వహిస్తోంది. దేశంలో 236 జిల్లాలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. దేశంలో తన బాట్లింగ్ కార్యకలాపాలను క్రమంగా ఫ్రాంచైజ్ చేసే వ్యూహంలో భాగంగా గత సంవత్సరం, కోకా-కోలా హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్‌లో మైనారిటీ వాటాను జూబిలెంట్ భార్టియా గ్రూప్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications