Coca-Cola: కొత్త వ్యాపార సెగ్మెంట్‌లోకి కోకా-కోలా... గోవాలో ప్రయోగాత్మక అమ్మకాలు..

Lemon-Dou: అమెరికాకు చెందిన దిగ్గజ బెవరేజెస్ తయారీ సంస్థ కోకా-కోలా భారత మార్కెట్లపై భారీగా దృష్టి సారించింది. ఈ క్రమంలో అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తోంది.

కోకా-కోలా ఇండియా తాజాగా ఆల్కహాలిక్ బివరేజెస్ మార్కెట్లోని వ్యాపారాన్ని టార్గెట్ చేసింది. దీనికి ముందు దేశంలో టీ బ్రాండ్ విడుదల చేసింది. అయితే ప్రస్తుతం లెమన్-డౌ ఉత్పత్తి పైలట్ టెస్టింగ్‌తో ఆల్కహాల్ మార్కెట్‌లోకి దూసుకుపోవాలని నిర్ణయించింది. రెడీ టు డ్రింక్ ఆల్కహాల్ విభాగంలో వ్యూహాత్మక విస్తరణపై కంపెనీ దృష్టి సారించింది.

Coca-Cola enters alcohol market with Lemon-Dou launch in indian market as pilot

లెమన్-డౌ భారతదేశంలో కోకా-కోలా మొట్టమొదటి ఆల్కహాలిక్ పానీయాల సమర్పణను సూచిస్తుంది. కంపెనీ తొలుత దీనిని గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పైలట్ విక్రయాలను మెుదలుపెట్టింది. ఆల్కహాలిక్ కాక్‌టైల్ లెమన్-డౌ దీనిని 'చుహై' అని కూడా పిలుస్తారు. ఇది జపాన్ నుంచి ఉద్భవించింది. పైలట్ దశలో లెమన్-డౌ 250 ml క్యాన్ ధర రూ.230గా కోకాకోలా విక్రయిస్తోంది.

భారతీయ ఆల్కహాల్ పంపిణీ, తయారీ రంగాలలోని సంక్లిష్టతలను గుర్తిస్తూ.. కోకాకోలా భారీ నియంత్రణ, పన్నుల కారణంగా క్రమంగా మార్కెట్‌లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అబ్సోలట్ & స్ప్రైట్ అనే ప్రీ-మిక్స్డ్ కాక్‌టెయిల్‌పై పెర్నోడ్ రికార్డ్‌తో కోకా-కోలా సహకారం 2024లో వివిధ యూరోపియన్ దేశాల్లో ప్రారంభించబడుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+