Coca-Cola: అమెరికాకు చెందిన సాఫ్ట్ డ్రింక్స్ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సంస్థ కోకాకోలా. ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న కంపెనీ ఇతర వ్యాపారాల్లోకి విస్తరిస్తోంది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన పానీయాల కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను కోకాకోలా లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే కంపెనీ టీ వ్యాపారంలోకి ప్రవేశించింది. దీనికోసం 'హానెస్ట్ టీ' పేరుతో ఉత్పత్తులను ఆవిష్కరించింది. హానెస్ట్ టీ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ఆర్గానిక్ గ్రీన్ టీ కోల్‌కతాలోని మకైబారి టీ ఎస్టేట్ నుంచి సేకరించబడుతోంది. సేంద్రియ టీ ఉత్పత్తుల నిబద్ధతను ఇది సూచిస్తోంది.

బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా కోకాకోలా, లక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.'హానెస్ట్ టీ' ప్రారంభం కోకాకోలా తన ఉత్పత్తులను అందించే వ్యూహంలో భాగమని తెలుస్తోంది. అలాగే విస్తృత శ్రేణి వినియోగదారుల ప్రాధాన్యతలను, ముఖ్యంగా సహజమైన, ఆరోగ్యకరమైన బెవరేజెస్ ఎంపికలు పెరుగుతున్న తరుణంలో కంపెనీ ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతోంది.
'హానెస్ట్ టీ' బ్రాండ్ ముందుగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. లెమన్- తులసీ, మ్యాంగో ఫ్లేవర్లలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో వ్యాపారాన్ని విస్తరించి ఆదాయాలను పెంచుకోవటంతో పాటుగా ప్రజాధారణను పొందేందుకు కొత్త ఉత్పత్తులను తీసుకురావాలని కోకాకోలా నిర్ణయించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications