Campa Cola: సాధారణంగా ముఖేష్ అంబానీ ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే ముందుగా చేసేది ఆ రంగంలోని ఇతర ఆటగాళ్లను చంపేయటం లేదా మాయం చేయటం. దీనికోసం ఆయన ప్రధానంగా డీప్ పెనిట్రేషన్ స్ట్రాటజీని వినియోగిస్తుంటారు. ఇందులో ఆయన టార్గెట్ చేసేది ప్రైస్ సెన్సిటివ్ వినియోగదారులనే. కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో క్విక్ మూవ్ కావాలంటే తక్కువ ధరలకు ఉత్పత్తులను విస్తృత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని అంబానీకి బాగా తెలిసిన ఆట.
ఈ క్రమంలోనే క్యాంపా కోలాతో భారతీయ మార్కెట్లలో తన ఆట మెుదలెట్టారు ముఖేష్ అంబానీ. అయితే ఇప్పుడు దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోకాకోలా, పెప్సికో నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రాంతీయ మార్కెట్లలో తక్కువ ధరలకు సాఫ్ట్ డ్రింక్ లను ప్రస్తుతం ఉన్న బ్రాండ్ల కంటే 15-20 శాతం తక్కువ రేట్లకే కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నాయి. దేశంలో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ క్యాంపా కోలా నుంచి వస్తున్న వ్యాపార ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారించటానికి ఈ ప్రణాళికతో అమెరికా సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు వస్తున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ దేశంలో రిటైలర్లకు అధిక మార్జిన్లను అందిస్తూ క్యాంపా ఉత్పత్తుల పంపిణీని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది.

అంబానీ నుంచి పోటీని ఎదుర్కొనేందుకు అవసరమైతే బి సెగ్మెంట్ కింద పోటీ ధరకు ఉత్పత్తులను తయారు చేస్తామని దేశంలో అతిపెద్ద పెప్సికో బాట్లింగ్ భాగస్వామి అయిన వరుణ్ బెవరేజెస్ ఛైర్మన్ రవి జైపురియా అన్నారు. ఈ క్రమంలోనే కోకాకోలా ప్రాంతీయ బ్రాండ్‌లను విడుదల చేయడానికి బ్లూప్రింట్‌లను ఉంచడంతో పాటు, ప్రత్యేకించి టైర్-2 మార్కెట్‌ల కోసం కంపెనీ రూ.10కి రిటర్నబుల్ గ్లాస్ బాటిళ్ల పంపిణీని కూడా పెంచుతోందని విషయం తెలిసిన వ్యక్తుల ద్వారా వెల్లడైంది. కోకాకోలా రిమ్జిమ్ జీరా పేరుతో విడుదల చేసిన ఉత్పత్తి తక్కువ స్థాయిలో ఉత్పత్తిని కొనసాగిస్తోంది.

ప్రాంతీయ మార్కెట్లలో శీతలపానీయాల మార్కెట్లో చెన్నైకి చెందిన బోవోంటో, రాజస్థాన్‌లో జయంతి కోలా, లెమోంటా, యాప్ లిజ్ ఉన్నాయి. ఇదే క్రమంలో గుజరాత్‌లో కాశ్మీరా, జిన్లిమ్, లెమీ, రన్నర్ బ్రాండ్లు ప్రజాధరణను పొందుతున్నాయి. ఇదే క్రమంలో మరో ప్రాంతీయ ఆటగాడిగా రిలయన్స్ క్యాంపా కోలా కూడా వచ్చి చేరింది. రిలయన్స్ కన్స్యూమర్ క్యాంపాను 200 ml బాటిళ్లకు 10కి విక్రయిస్తుండగా.. కోకాకోలా-పెప్సికో మాత్రం 250 ml బాటిళ్లను 20 ధరకి విక్రయిస్తున్నాయి. అంబానీ జియోలో సైతం ఇదే తరహాలో ప్రైసింగ్ స్టాటజీని ఫాలో అయ్యి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications