Cheyutha Pensions: గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు..
చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 8 నుంచి అంటే నేటి నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మరో 4.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లను ఇస్తామని ప్రకటించారు. ఈ బృహత్తర పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నవంబర్ 8న వికారాబాద్ జిల్లా కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి సీతక్కతో కలిసి లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేయనున్నారు.
కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందచేస్తారని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా లాక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రభుత్వానికి 5 లక్షలకు పైగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. దీంతో అధికారులు దరఖాస్తదారుల స్థితిని తెలుసుకునేందుకు వెరిఫికేషన్ చేసి వివరాలను ఆన్ లైన్ నమోదు చేశారు.

ఆ తర్వాత 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కొడంగల్లో ప్రారంభమయ్యే కార్యక్రమం అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు. భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతువులు, కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళలు, జీవనోపాధి కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్న దివ్యాంగులకు ఈ పింఛన్లు ఇవ్వనున్నారు. అలాగే సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులు, గీత కార్మికులకు కూడా ప్రభుత్వం చేయూత పింఛన్లు అందించనున్నారు.
కేవలం మంజూరు పత్రాల పంపిణీకే పరిమితం కాకుండా, ఈ నెల నుంచే నూతన లబ్ధిదారుల ఖాతాలకు పింఛన్ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దీర్ఘకాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలోనే ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండలస్థాయిలో కాంగ్రెస్ నేతలు కొత్త పింఛన్ పత్రాలు అందజేసే అవకాశ ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications